గుజరాత్ పోరు: మెహ్సానాలో మోదీ చివరి ర్యాలీ
అహ్మదాబాద్ లో గుజరాత్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడిన కారణంగా.. ప్రధాని నరేంద్ర మోదీ సెకండ్ ప్లాన్ అలోచించి విన్నూత రీతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గుజరాత్ లో రెండో దఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన నేడు ఆయన ఓటర్లను కలుస్తున్నారు. గుజరాత్ లో రెండో దఫా ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. సాయంత్రం 5-6 తర్వాత ఎవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు. డిసెంబర్ 14న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 19న ఓట్లు లెక్కిస్తారు.
ధారోయ్ డ్యాం కు వెళ్ళడానికి ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతి నది వద్దకు చేరుకొని సముద్ర విమానం ఎక్కారు. మెహ్సానా జిల్లాలో ఉన్న ధారోయ్ డ్యాం అహ్మదాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని ప్రచారం నేటితో ముగుస్తుంది.
ఉత్తర గుజరాత్ లోని అంబాజీ ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వెళతారు. ప్రధాని మోదీ నెలరోజుల నుంచి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మెహ్సానాలో జరిగే చివరి ర్యాలీలో పాల్గొని మోదీ ప్రచారాన్ని ముగిస్తారు.
అహ్మదాబాద్ లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్ షోలకు నగర పోలీసులు శాంతిభద్రతలు, ట్రాఫిక్ కారణంగా అనుమతించలేదన్న విషయం తెలిసిందే..!