భారతదేశ మాజీ రాష్ట్రపతి ( Ex president ), కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ( Pranab mukherjee ) ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం లేదని  ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టు ఆర్మీ హాస్పటల్ ( Army hospital ) వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన డీప్ కోమాలో ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ఆరోగ్యం గతం కంటే ఇంకా క్షీణించిందని ( Deteriorating of health )...శరీరంలోని ఒక్కొక్క అవయవం పనిచేయడం లేదని చెప్పారు. ప్రస్తుతం మూత్రపిండాలు ( lungs ) పని చేయడం లేదన్నారు. ఊపిరితిత్తుల్లో అయితే ఇన్ ఫెక్షన్ పెరిగిందన్నారు. కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ప్రణబ్ ముఖర్జీకు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే ఆస్పత్రిలో ఆయనకు కొద్దిరోజుల ముందు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ప్రణబ్ వెంటిలేటర్ పై ఉన్నారు. Also read: CoviShield: 60 రోజులు ఓపిక పట్టండి అంటున్న సీరం సీఈఓ