Dharma sansad case: హరిద్వార్​లోని ధర్మ సంసాద్​కు సంబంధించిన ఇటీవలి ద్వేశ పూరిత ప్రసంగం కేసులో ది హిందూ ఫ్రంట్​ ఫర్ జస్టిస్ (Hindu Front for Justice)​ అధ్యక్షుడు సహా పలువురు ఇతరులు కలిసి.. సుప్రీం కోర్టులో ఇంటర్వేన్షన్​ పిటిషన్ దాఖలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించిన నేపథ్యంలో.. హిందువులపై విద్వేశ పూరిత ప్రసంగాలను పరిశీలించేలా కూడా కోర్టు ఆదేశించాలని (SIT probe into hate speeches) పిటిషనర్లు పేర్కొన్నారు.


ఇందుకు గాను.. మజ్లీస్​ నేత అక్భరుద్దిన్ ఒవైసీ (Akbaruddin Owaisi), ఆప్​ నేత అమానాతుల్లా ఖాన్​ వంటి రాజకీయ నాయకులు చేసిన డజన్లకొద్ది వ్యాఖ్యలను ఉటంకిస్తూ తమ పిటిషన్​ను దాఖలు చేశారు.


హిందూ దేవుళ్లపై వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలపై విచారణ జరిపేలా సిట్​ను ఆదేశించాలని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. 


అదే విధంగా రాజ్యంగ స్పూర్తి, భారత ఐక్యతను దెబ్బతీసేలా చేసిన విద్వేశపూరిత ప్రసంగాల ఘటనలపై కడా విచారణకు ఆదేశించాలన కోర్టును కోరారు పిటిషనర్లు.


పిటిషన్​లో ఇంకా ఏముందంటే..


కొంత మంది ముస్లిం నాయకులు, బోధకులు.. హిందూ మతానికి వ్యతిరేకంగా, భారత సార్వభౌమధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని పిటిషనర్లు తమ పిటిషన్​లో పేర్కొన్నారు. కొంత మంది చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు..  హిందువుల్లో భయాలు సృష్టిస్తున్నాయని కూడా  తెలిపారు పిటిషనర్లు.


ఈ పరిణామాలన్ని దేశ విభజనకు దారి తీసిన ముస్లిం లీగ్​ పనిని గుర్తు చేస్తున్నాయని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్లను తమ ఫిర్యాదును న్యాయ వాది విష్ణు శంకర్ జైన్​ ద్వారా దాఖలు చేశారు.


Also raad: Covid New Guidelines: పంజా విసురుతున్న కరోనా మహమ్మారి, కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు


Also read: Covid 19 Update: దేశంలో వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook