మొఘల్ రాజు అల్లా ఉద్దీన్ ఖిల్జీ స్వయంగా రాణి పద్మినిని చూసాడు అని చిత్తోర్ గఢ్ కోటలోని పద్మిని మహల్ కు ముందున్న శిలాఫలకంలో చరిత్రకారులు  రాయించారు. అయితే ప్రస్తుతం ఈ శిలా ఫలకాన్ని ఆర్కియాలజీ మ్యూజియం అధికారులు మూసేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ శిలాఫలకంలో ఏముందటే- "మేవార్ రాజు రాణా రతన్ సింగ్ రాణి పద్మావతి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీకి ఒకగదిలో అద్దం ద్వారా చూపించాడు. ఆతరువాత ఖిల్జీ రాణి అందానికి మంత్రముగ్దుడై ఆమెను చేజిక్కించుకోవడానికి క్రీ.శ.1303లో చిత్తోర్ గఢ్ కోట పై దాడిచేసాడు. అయితే యుద్ధంలో రాణా రతన్ సింగ్ చనిపోయాడు. ఖిల్జీ చేతికి చిక్కడం ఇష్టంలేని రాణి పద్మిని ఆత్మాహుతి పాల్పడి ప్రాణత్యాగం చేసింది" అని ఉంది.


కర్ణిసేన ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవచ్చు అని ఆర్కియాలజీ అధికారులు భావించారు. ఉన్నతాధికారులను సంప్రదించిన తరువాతే శిలాఫలాన్ని మూసేశామని ఆర్కియాలజీ అధికారి తెలిపారు.  కర్ణిసేనలోని కొందరు చరిత్రను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.