న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరిగితేనే వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందంటే... ఇప్పుడు పెట్రోల్ ధర ( Petrol price ) కంటే డీజిల్‌ ధర ఎక్కువ ( Diesel price ) అవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూన్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేనప్పటికీ.. ఇటీవల గత కొద్ది రోజులుగా డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. నిన్న శుక్రవారం లీటర్ డీజిల్ ధరపై 17 పైసలు పెరిగిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.81.58కు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.43 గా ఉంది. ( Also read: IIT admissions: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీల్లో ప్రవేశానికి తొలగిన అడ్డంకి )


పెట్రోల్‌ ధరల కంటే డీజిల్‌ ధర స్వల్పంగా పెరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా డీజిల్ ధర స్వల్పంగా పెరిగిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో ఈ అరుదైన పరిస్థితి కనిపించింది. ( Also read: యాంకర్ అనసూయ #CybHer క్యాంపెయిన్‌.. ఎనర్జిటిక్ వీడియో )