చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణస్వీకారం
.
ఢిల్లీ: సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్ర (64) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ గా జగదీష్ సింగ్ ఖేహర్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో దీపక్ మిశ్ర బాధ్యతలు స్వీకరించారు. సీజే దీపక్ మిశ్ర అక్టోబర్ 2 వరకు పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
సీజే దీపక్ మిశ్రా ప్రస్థానం..
జస్టిస్ దీపక్ మిశ్రా 1977లో లాయర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అనంతరం ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ.. 1996లో ఓడిషా హైకోర్టు అడిషనల్ జడ్జి గా నిమమితులయ్యారు. 1997లో మధ్యప్రదేశ్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా వ్యవహరించారు. 2009లో పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ , 2010లో ఢిల్లీ హైకోర్టు కు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. అనంతరం 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుదూ నేడు అత్యున్నత ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు దీపక్ మిశ్రా.