Stalin vs Amit Shah: హిందీపై మళ్లీ వివాదం, హిందీకి బానిసలు కాబోమని స్టాలిన్ ట్వీట్
Stalin vs Amit Shah: దక్షిణాది వర్సెస్ హిందీ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. హిందీ భాషపై తాజాగా అమిత్ షా వర్సెస్ స్టాలిన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Stalin vs Amit Shah: దేశవ్యాప్తంగా హిందీని జాతీయ భాషగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటిలానే దక్షిణాది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. హిందీ భాష విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన కౌంటర్ వివాదాన్ని మరింత పెంచేలా కన్పిస్తోంది.
హిందీ భాష ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన అధికార భాష పార్లమెంటరీ కమిటీ 38వ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషకు ఆమోదం తక్కువగా ఉన్నా..అందరూ వ్యతిరేకత లేకుండా అంగీకరించాలని అమిత్ షా కోరారు. హిందీ అనేది ఇతర భాషలకు పోటీ కాదని..అన్ని భారతీయ భాషల్ని ప్రోత్సహిస్తేనే దేశం సాధికారత దిశగా పయనిస్తుందన్నారు అమిత్ షా.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యల్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించారు. హిందీ భాషకు అంగీకారం కోసం అమిత్ షా చేస్తున్న ఒత్తిడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇదంతా హిందీయేతరుల్ని లొంగదీసుకునే ప్రయత్నంగా అమిత్ షా అభివర్ణించారు. హిందీ ఆధిపత్యాన్ని, ప్రయోగాన్ని తమిళనాడు అంగీకరించదన్నారు స్టాలిన్. హిందీకి బానిసలుగా ఉండబోమని తేల్చి చెప్పేశారు. ఇప్పటికే కర్ణాటక, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లో హిందీని బలవతంగా రుద్దడంపై వస్తున్న వ్యతిరేకతను కేంద్ర మంత్రి అమిత్ షా గమనించాలని సీఎం స్టాలిన్ కోరారు.
కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు హిందీ అమలును తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయని..1965 నాటి హిందీ వ్యతిరేక ఆందోళన మరోసారి పెరిగేలాచేయడం తీవ్ర అనాలోచిత చర్య అని స్టాలిన్ సూచించారు.
Also read: Chandryaan 3: చంద్రయాన్ 3 లో కీలకఘట్టం, విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook