Chandryaan 3: చంద్రయాన్ 2 చివరి దశలో విఫలం కావడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇస్రో చంద్రయాన్ 3 ప్రాజెక్టు చేపట్టింది. 40 రోజుల పాటు సాగే ప్రయాణంలో కీలకమైన మూడు దశలు దాటేసినట్టు ఇస్రో ప్రకటించింది. ఇవాళ కీలక ఘట్టాన్ని చేరుకోవడంతో ఇస్రో హర్షం వ్యక్తం చేసింది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్ 3 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అత్యంత కీలకంగా భావించే మూడవ దశను దాటింది. సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3ను టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌తో చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది ఇస్రో. మరో 18 రోజులు చంద్రుని కక్ష్యలో తిరిగి ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుని దక్షిణ ధృవంగా విజయవంతంగా ల్యాండ్ అయితే చంద్రయాన్ 3 సక్సెస్ అయినట్టు అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు 18 రోజుల పాటు చంద్రుని కక్ష్యలో 3.8 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది చంద్రయాన్ 3. అన్నీ సక్రమంగా ఉంటే ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రునిపై ల్యాండ్ కానుంది. కాదంటే 25వ తేదీన చంద్రుని దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. చంద్రునిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్లకు ఇదే ప్రధానమైన తేడా అని ఇస్రో తెలిపింది.
Chandrayaan-3 Mission Update:
Lunar Orbit Insertion (LOI) maneuver was completed successfully today (August 05, 2023). With this, #Chandrayaan3 has been successfully inserted into a Lunar orbit.
The next Lunar bound orbit maneuver is scheduled tomorrow (August 06, 2023), around… pic.twitter.com/IC3MMDQMjU
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 5, 2023
చంద్రయాన్ 2 సమయంలో మిషన్ ల్యాండ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీ కొనడం వల్ల అందులోని వ్యవస్థలు పనిచేయకుండా పోయినట్టు ఇస్రో తెలిపింది. అందుకే ఈసారి ల్యాండర్‌ను మరింతగా అభివృద్ధి చేసి చంద్రునిపైకి పంపించారు.
Also read: Sikhs Riots: సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్ నేత చుట్టూ ఉచ్చు, ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook