Divorce Case: కలిసుంటామని చెప్పిన కాసేపటికే.. కోర్టు ప్రాంగణంలోనే భార్యను హత్య చేసిన భర్త..
Karnataka Divorce Case: కర్ణాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టులో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. కౌన్సెలింగ్ సెషన్‌కి హాజరైన సందర్భంగా పదునైన వస్తువుతో భార్య గొంతు కోసి హత్య చేశాడు.
Karnataka Divorce Case: కర్ణాటకలో దారుణం జరిగింది. ఫ్యామిలీ కోర్టులో కౌన్సెలింగ్ సెషన్‌కి హాజరైన సందర్భంగా ఓ భర్త తన భార్యను హతమార్చాడు. పదునైన వస్తువుతో ఆమె గొంతు కోసేశాడు. ఆపై తన బిడ్డను కూడా చంపబోయాడు. అక్కడే ఉన్నవారు అడ్డుకోవడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. హోలెనరసిపురా జిల్లా కేంద్రంలోని ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రామనగర జిల్లా తట్టెకెరె గ్రామానికి చెందిన చైత్ర, హోలెనరసిపురాకి చెందిన శివకుమార్‌లకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. కొన్నాళ్ల పాటు సాఫీగా సాగిన కాపురంలో కలహాలు చోటు చేసుకున్నాయి. దీంతో చైత్ర, శివకుమార్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
ఫ్యామిలీ కోర్టు శనివారం (ఆగస్టు13) కౌన్సెలింగ్‌కి పిలవడంతో భార్యాభర్తలు ఇద్దరు హాజరయ్యారు. పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందని ఫ్యామిలీ కోర్టు వారికి సూచించింది. సుమారు గంట పాటు జరిగిన కౌన్సెలింగ్ తర్వాత.. చైత్ర,శివకుమార్ కలిసి ఉండేందుకు అంగీకరించారు. విడాకుల పిటిషన్‌ని ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలిపారు.
కౌన్సెలింగ్ హాల్ నుంచి బయటకొచ్చిన చైత్ర వాష్‌రూమ్ వైపు వెళ్లగా.. వెనకాలే శివకుమార్ వెళ్లాడు. పదునైన వస్తువుతో ఆమె గొంతు కోసేశాడు. ఆపై తన బిడ్డపై దాడి చేయబోయాడు. అక్కడే ఉన్నవారు శివకుమార్‌ను అడ్డుకోవడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిన చైత్రను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కౌన్సెలింగ్ జరుగుతున్నంత సేపు కూల్‌గా కనిపించిన శివకుమార్.. భార్యతో కలిసి ఉండేందుకు అంగీకరించి.. ఆ వెంటనే ఆమెపై దాడికి పాల్పడటం అక్కడ ఉన్నవారిని విస్మయానికి గురిచేసింది. శివకుమార్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Srinivas Goud: మంత్రి గన్ ఫైర్ చేసినా డీజీపీ మౌనం? ఆ పోస్ట్ కోసమేనంటూ బీజేపీ ఫైర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook