Diwali Holidays: దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పండుగ రోజు ఎలాగో సెలవు ప్రకటించగా.. కొత్త బట్టలు, బాణసంచా వంటివి కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ముందు రోజు అంటే రేపు సగం రోజు సెలవు ప్రకటించింది. ఉదయం విద్యాలయాలకు వెళ్లి వస్తే చాలు ఆ తర్వాత ఎంచక్కా పండు చేసుకోవచ్చు. పండుగకు సిద్ధం అయ్యేందుకు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సగం రోజు సెలవు ప్రకటించడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సగం రోజు సెలవు ప్రకటించింది తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కావు తమిళనాడు ప్రభుత్వం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Survey: తెలంగాణ సర్కార్‌ సంచలనం.. మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే


దీపావళి పండుగ 31వ తేదీన ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జాతీయ సెలవు దినం గురువారం ఇచ్చారు. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం దీపావళి పండుగకు ఉన్న ప్రాధాన్యం.. పిల్లల ఉత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని ముందే సెలవు ప్రకటించింది. స్వగ్రామాలకు వెళ్లేందుకు.. సాయంత్రం వేళల్లో షాపింగ్‌ చేయడం కోసం సమయం ఇచ్చింది. ఈ కారణంగా బుధవారం సగం రోజు సెలవు ప్రకటించింది.

Also Read: Revanth Reddy: మొదట కేసీఆర్.. తర్వాత కేటీఆర్.. చివరకు హరీశ్ రావును ఫినిష్ చేస్తా


దేశంతోపాటు తమిళనాడులో దీపావళి పండుగను సంబరంగా చేసుకుంటారు. ముఖ్యంగా పండుగ అంటే చిన్నారులదే సందడి. పండుగ సందర్భంగా పట్టణ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లడం.. ప్రయాణించడం.. కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడం.. బాణసంచా కొనడం వంటి పనులు ఉండడంతో ప్రభుత్వం సగం రోజు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 


'అక్టోబర్‌ 30వ తేదీ బుధవారం ఉదయం పాఠశాలలు, కళాశాలలు పని చేస్తాయి. నాలుగున్నర రోజులు సెలవులు ముగిసి నవంబర్‌ 4వ తేదీన పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరచుకుంటాయి' అని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దీపావళి పండుగ సందర్భంగా గ్రూప్‌ సీ, డీ ఉద్యోగులకు అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బోనస్‌ ప్రకటించారు. ప్రభుత్వం బోనస్‌తోపాటు పిల్లలకు కావాల్సినన్ని సెలవులు ఇవ్వడంతో ఉద్యోగులతోపాటు విద్యార్థులు పండుగలో మునిగారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook