Chardham yatra: చార్‌థామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చవద్దు
Chardham yatra: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపధ్యంలో చార్‌థామ్ యాత్ర ప్రశ్నార్ధకమవుతోంది. చార్‌థామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చవద్దని న్యాయస్థానం ఆదేశించడమే దీనికి కారణం.
Chardham yatra: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపధ్యంలో చార్‌థామ్ యాత్ర ప్రశ్నార్ధకమవుతోంది. చార్‌థామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చవద్దని న్యాయస్థానం ఆదేశించడమే దీనికి కారణం.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండ్రోజులుగా 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కరోనా మహమ్మారి ప్రభావం చార్‌థామ్ యాత్ర ( Chardham yatra) పడనుంది. మే 14 నుంచి అక్షయ తృతీయ రోజున యమునోత్రి ధామ్, మే 15 నుంచి గంగోత్రి ధామ్, మే 17 నుంచి కేదార్‌నాధ్(Kedarnath dham), మూడవ కేదార్ తుంగ్నాధ్, 18 వ తేదీన బద్రీనాధ్ థామ్ (Badrinath dham) ఆలయాలు భక్తుల కోసం తెర్చుకోనున్నాయి. కరోనా ఉధృతి నేపధ్యంలో ఇప్పటికే చార్‌థామ్ యాత్రంలో పాల్గొనాలనుకున్న భక్తులు, పర్యాటకులు హోటల్స్, కాటేజెస్, రెస్టారెంట్ల బుకింగ్స్ ఒక్కొక్కటిగా రద్దు చేసుకుంటున్నారు.
కేవలం వారం రోజుల వ్యవధిలో గఢ్‌వాల్ మండల్ వికాస్ నిగం వద్ద జరిగిన మూడు కోట్ల బుకింగ్స్‌లో 8 లక్షలు రద్దయ్యాయి. హోమ్ స్టే ఆపరేటర్లకు చెందిన 2 లక్షల బుకింగ్స్ రద్దయ్యాయి. బుకింగ్స్ వాయిదా కోసం ప్రతిరోజూ దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బుకింగ్స్ ఒక్కొక్కటిగా రద్దవుతుండటం చార్‌థామ్ యాత్రపై పడుతున్న ప్రభావానికి నిదర్శనంగా ఉంది. గత 15 రోజుల్లో తలెత్తిన కరోనా పరిస్థితులు భక్తుల్లో సందేహాలకు కారణమయ్యాయంటున్నారు స్థానిక వ్యాపారులు.
మరోవైపు కోవిడ్ 19 కేసుల్ని(Covid19 cases) దృష్టిలో ఉంచుకుని అనుసరించాల్సిన విధానాల్ని వెంటనే ప్రకటించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ( Uttarakhand high court) ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్‌థామ్ యాత్రను మరో కుంభమేళా(Kumbhmela) గా మార్చేందుకు అనుమతించలేమని స్పష్టం చేసింది.చార్‌థామ్ యాత్రపై హైకోర్టులో దాఖలైన పలు పిటీషన్లపై హైకోర్టు విచారణ చేసింది.
Also read: Ashish Yechury Death News: కరోనాతో సీపీఎం నేత Sitaram Yechury కుమారుడు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook