Indian Railways Luggage Rules: విమాన ప్రయాణమే కాదు..రైలు ప్రయాణంలో కూడా నిర్ణీత లగేజ్ నిబంధనలున్నాయనేది మీలో ఎంతమందికి తెలుసు. రైలు ప్రయాణం చేసేవారు తప్పకుండా ఈ నియమాలు గురించి తెలుసుకోండి. లేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ రైల్వే ప్రయాణీకుల(Indian Railways) కోసం నిర్ణీత లగేజ్ విషయంలో కొన్ని నియమాలు రూపొందించింది. కేవలం విమాన ప్రయాణంలోనే కాకుండా రైలు ప్రయాణం చేసేటప్పుడు కూడా తప్పకుండా లగేజ్ నిబంధనలు పాటించాల్సి వస్తుంది. లేకపోతే పెద్దమొత్తంలో ఫైన్ కట్టాల్సి వస్తుంది. దేశంలో అత్యధికంగా ప్రయాణించేది రైలు మార్గం ద్వారానే. అయితే ప్రయాణ సమయంలో ఎంత లగేజ్ తీసుకెళ్లాలనే విషయంపై కచ్చితంగా నియమాలున్నాయి. నిర్ణీత లగేజ్ కంటే ఎక్కువ తీసుకెళితే ఏకంగా ఆరు రెట్లు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.


ఒకవేళ మీరు అవసరం కంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే..చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎందుకంటే రైల్వే నియమాల ప్రకారం నిర్ణీతమైన పరిమాణంలోనే లగేజ్ వెంట తీసుకెళ్లాలి. రైల్వే నియమాల ప్రకారం కొన్నిరకాల సామాన్లు రైలు ప్రయాణ సమయంలో తీసుకెళ్లడం నిషేధం. ఒకవేళ నిషేధిత వస్తువుల్ని తీసుకెళ్లాల్సి వస్తే..జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. విమాన ప్రమాదం తరహాలోనే రైల్వేలో కూడా లగేజ్ విషయంలో నిర్ణీత పరిమాణం ఉంటుంది. రైల్వే దీనికోసం కఠినమైన నిబంధనలు కూడా రూపొందించింది. రైల్వే నియమాల(Railway Rules)ప్రకారం 50 కిలోల వరకూ లగేజ్ తీసుకెళ్లవచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువ లగేజ్ ఉంటే మాత్రం ఎక్స్‌ట్రా ఛార్జ్ చెల్లించాల్సిందే.


ఒకవేళ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తుంటే..70 కిలోల వరకూ లగేజ్ తీసుకెళ్లేందుకు పరిమితి ఉంటుంది. స్లీపల్ క్లాస్‌లో మాత్రం 40 కిలోల వరకే లగేజ్(Luggage Rules) అనుమతి ఉంది. అంతకంటే ఎక్కువైతే ఎక్స్‌ట్రా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ లగేజ్ తీసుకెళితే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 30 రూపాయలు ఫైన్ ఉంటుంది. ఒకవేళ రోగులెవరైనా ప్రయాణిస్తుంటే మాత్రం..ఆక్సిజన్ సిలెండర్‌ను కూడా వెంట తీసుకెళ్లవచ్చు. ప్రయాణ సమయంలో విస్ఫోటక లేదా ప్రమాదకర పదార్ధాలు తీసుకెళ్లకూడదు.ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకూ జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 


Also read: Mysterious Death Alert: ఒమిక్రాన్‌కు తోడుగా అంతుచిక్కని భయంకర వ్యాధి ముప్పు, పదుల సంఖ్యలో మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook