తమిళనాడు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపట ఆవిష్కరణోత్సవం ఈ నెల 12వ తేదీన రంగరంగ వైభవంగా జరగబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనీస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోదీని ఆహ్వానించగా.. బిజీ షెడ్యూల్ వల్ల ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఆయన హాజరవుతారా? లేదా? అన్న విషయం పై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పళనీస్వామి స్వయంగా మోదీని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించగా.. ఆయన వీలును బట్టి రావడానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చిన్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో పళనీ స్వామి ఢిల్లీ వెళ్లినప్పుడు మోదీని కలిసి ఈ విషయం మీద మాట్లాడారని కూడా తెలుస్తోంది. 


"స్వర్గీయ జయలలిత తన జీవితాన్ని మొత్తం తమిళుల అభ్యున్నతికి అంకితమిచ్చారు. తమిళ భాష, సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించారు. మీ లాంటి గొప్ప శిఖరం లాంటి మనసు ఉన్న వ్యక్తి ఆమె చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తే.. మేము ఎంతో సంతోషిస్తాం. అలాగే తమిళనాడు ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తారు" అని పళనీస్వామి మోదీని ఆహ్వానిస్తూ చెప్పారని పలు వార్తాపత్రికలు రాశాయి.