శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పేస్ట్ స్వాధీనం
స్మగ్లర్లు కొత్త రకం బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.
స్మగ్లర్లు కొత్త రకం బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. బంగారాన్ని ముద్దలా తయారు చేస్తూ కస్టమర్లకు చేరవేస్తున్నారు. ఇలా ఓ స్మగ్లర్ల ముఠా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయిన ఘటన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద చోటుచేసుకుంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ తనిఖీలు చేపట్టి ఒక కిలో 850 గ్రాముల బంగారం పేస్ట్‌ను శనివారం స్వాధీనం చేసుకున్నారు. మధురై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి నుంచి ఈ బంగారం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుతో తయారుచేసిన మెత్తటి కడ్డీ రూపంలో తరలిస్తుండగా అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు. నిందితుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ బంగారం పేస్టు విలువ దాదాపు 35 లక్షలు.