Drugs will become sugar powder if Shah Rukh Khan joins BJP, says Maharashtra Minister: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ లో డ్రగ్స్ దొరికిన కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఆ డ్రగ్స్ కేసు ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు (Aryan khan) బెయిల్ రావడం లేదు. ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని ముంబైలోని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఛాగన్ బుజ్బ్‌పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) బీజేపీలో చేరినట్లైతే డ్రగ్స్ పంచదార పౌడర్ (sugar powder) అవుతుందని భారతీయ జనతా పార్టీపై (BJP) తీవ్ర స్థాయిలో మండి పడ్డారు ఛాగన్ బుజ్బ్‌పాల్. అయితే గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల డ్రగ్స్ దొరికిన విషయాన్ని చాగన్ ప్రస్తావిస్తూ క్రూజ్ షిప్‌పైనే.. ఎన్సీబీ (NCB) ఎందుకు దృష్టి పెట్టిందని ప్రశ్నించారు. 


Also Read : India Vs Pakistan: టీమిండియాపై గెలిస్తే పాకిస్తాన్ క్రికెటర్లకు బ్లాంక్ చెక్: రమీజ్


దేశంలో వందల, వేల కిలోల డ్రగ్స్ బయటపడుతున్నాయని ఛాగన్ బుజ్బ్‌పాల్ అన్నారు. తాజాగా గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల డ్రగ్స్ సీజ్ చేశారని ఛాగన్ బుజ్బ్‌పాల్ (Chhagan Bhujbal) గుర్తు చేశారు. 


అయితే ఎన్సీబీ ఒక్క ముంబైనే టార్గెట్ చేసిందని తప్పుబట్టారు. క్రూజ్ షిప్‌లో దొరికిన డ్రగ్స్ చాలా తక్కువ అని ఛాగన్ బుజ్బ్‌పాల్ అన్నారు. కేవలం దీనిపైనే దృష్టి సారించడం కక్షపూరితమే అని ఆయన అన్నారు. ఒకవేళ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) బీజేపీలో చేరితే ముంబైలోని డ్రగ్స్ మొత్తం పంచదార పౌడర్ అయిపోతుందన్నారు.


Also Read : TRS plenary : రేపు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook