Shah Rukh Khan met Aryan Khan: ముంబై ఆర్థర్‌ రోడ్డు జైల్లో ఆర్యన్‌ ఖాన్‌ను కలుసుకున్న షారుక్‌

Shah Rukh Khan met Aryan Khan: షారుక్‌ ఖాన్‌ ముంబై ఆర్థర్‌ రోడ్డు జైలులో ఆయన తనయుడిని కలిశారు. ఆర్యన్‌ పలుమార్లు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్‌ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది.

  • Oct 21, 2021, 20:45 PM IST

Shah Rukh Khan meets son Aryan Khan in Arthur Road Jail, NCB officials reach Mannat: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన తనయుడు ఆర్యన్‌ను చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చారు. ముంబై ఆర్థర్‌ రోడ్డు జైలులో ఆయన తనయుడిని కలిసి కాపేపు మాట్లాడారు. ఈ నెల అక్టోబర్‌ 2న రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌పై దాడి చేసిన పోలీసులు షారుక్‌ కుమారుడితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఆర్యన్‌ పలుమార్లు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్‌ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది.

1 /5

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్‌ ఖాన్‌ను విడిపించేందుకు షారుక్‌ ఖాన్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ రాలేదు. (Pics Courtesy: Viral Bhayani)

2 /5

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే షారుక్‌ ఖాన్‌ తొలిసారిగా ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైళ్లో ఉన్న తన కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కలిశారు.(Pics Courtesy: Viral Bhayani)

3 /5

షారుక్‌ ఖాన్‌ను చూడగానే ఆర్యన్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు సమాచారం. వీరి మధ్య గ్రిల్‌, గాజు గోడ అడ్డంగా ఉంది. ఇంటర్‌కామ్‌ ద్వారా వీరిద్దరూ మాట్లాడుకున్నారు. (Pics Courtesy: Viral Bhayani)

4 /5

షారుక్‌ కొడుకును చూసి కన్నీళ్లు ఆపుకుంటూ..కొడుకులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. 

5 /5

 పోలీసుల అదుపులో ఉన్న ఆర్యన్‌ను షారుక్‌ కలుసుకోవడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల అక్టోబర్‌ 2న రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌పై దాడి చేసిన పోలీసులు షారుక్‌ కుమారుడితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.