Ravana Dahan in Ayodhya: 70 అడుగుల ఎకో ఫ్రెండ్లీ ‘రావణ దహనం’
Ravana Dahan in Ayodhya: విజయదశమి, నవరాత్రుల నేపథ్యంలో 70 అడుగుల భారీ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. అయోధ్యలోని సరయు తీరంలోని లక్ష్మణ్ కిలా నుంచి రాహణ దహనం కార్యక్రమాన్ని నేటి సాయంత్రం ప్రసారం చేసేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేశారు.
తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్న రామ్‌లీలా నేటితో ముగియనుంది. దసరా (Dussehra 2020), నవరాత్రులు నేపథ్యంలో 70 అడుగుల భారీ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. అయోధ్యలోని సరయు తీరంలోని లక్ష్మణ్ కిలా నుంచి రాహణ దహనం కార్యక్రమాన్ని నేటి సాయంత్రం ప్రసారం చేసేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేశారు. పర్యావరణ హిత దిష్టిబొమ్మను నిర్వాహకులు సిద్ధం చేశారు.
విజయదశమి (దసరా), మహా నవమి సందర్భంగా, ఈ రోజు (అక్టోబర్ 25న) సాయంత్రం 5:30 నుండి 6: 00 గంటల మధ్య 'రావణ దహనం' (Ravana Dahan) వేడుకతో రామ్‌లీలా కార్యక్రమం ముగిస్తారు. ఈ సంవత్సరం ప్రతి ఏడాదిలా 100 అడుగుల రావణుడి దిష్టిబొమ్మకు బదులుగా 70 అడుగుల పర్యావరణ హిత దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. స్థానికులను కాలుష్యం బారిన పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి రావణాసురుడి దిష్టిబొమ్మను ఢిల్లీలో తయారు చేసి అక్కడినుంచి అయోధ్యకు తరలించారు. నేటి మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ వర్చువల్ ఈవెంట్‌లో జానపద గాయని మాలిని అవస్తి, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్తి ఉన్నారు. ఈ ఈవెంట్‌ను 10 కోట్ల మందికి పైగా వీక్షిస్తారని రాల్‌లీలా నిర్వాహకులు చెబుతున్నారు. తొమ్మిది రోజుల రామ్‌లీలాను ఉర్దూతో సహా 14 భాషల్లో ప్రసారం చేస్తున్నారు.
Photo Gallery: Bigg Boss Telugu 4: బ్యూటిఫుల్ దివి ఫొటోస్ ట్రెండింగ్
కాగా, ముంబయికి చెందిన 120 మంది సిబ్బంది, 85 మంది కళాకారులు ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తారు. 55 మంది సభ్యుల దూరదర్శన్ బృందం సైతం రావణ దహనాన్ని తొమ్మిది వేర్వేరు కోణాల నుండి ఆకర్షణీయంగా చిత్రీకరిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe