Bank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివే
Dussehra Bank Holidays: విజయ దశమి దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా పెద్ద పండుగ. అందుకే ఈ సమయంలో సెలవులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకులకు సెలవులుంటాయి. అందుకే ఈ సమయంలో బ్యాంకు పనులుంటే సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. బ్యాంకులకు దసరా సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం.
Dussehra Bank Holidays: అక్టోబర్ నెలంటేనే ఫెస్టివల్ సీజన్. ఈ ఏడాది అయితే దసరా, దీపావళి రెండూ ఇదే నెలలో ఉన్నాయి. దాంతో సహజంగానే సెలవులు అధికంగా ఉన్నాయి. అందులో భాగంగానే బ్యాంకులకు సైతం దేశవ్యాప్తంగా సెలవులున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన అక్టోబర్ నెల సెలవుల ప్రకారం బ్యాంకులు ఈ నెల 14 వరకూ పనిచేయవు. మీకు బ్యాంకు పనులుంటే అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి.
హిందూవులకు దసరా అతి ముఖ్యమైన, పెద్ద పండుగ, నవరాత్రుల పేరుతో మొత్తం 10 రోజుల సందడి ఉంటుంది. దక్షిణాదిలో దసరా సందడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 3న ప్రారంభమైన దసరా సంబరాలు అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ముగియనున్నాయి. ఇప్పటికే విద్యార్ధాలు, టీచర్లు సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలలో బ్యాంకులు కేవలం 15 రోజులే పనిచేస్తున్నాయి. దసరా పురస్కరించుకుని బ్యాంకులకు వరుస సెలవులున్నాయి. దసరా సెలవులు రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయి. అయితే దాదాపు చాలా రాష్ట్రాల్లో ఏకంగా 4-5 రోజులు వరుస సెలవులున్నాయి. ఈ నెలలో బ్యాంకు పనులుంటే ఆ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలతో కలిపి అక్టోబర్ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. అందులే దసరా సెలవులే వరుసగా 4-5 రోజులున్నాయి. అంటే ఈ నెలలో 14వ తేదీ వరకూ బ్యాంకులకు వరుసగాసెలవులున్నాయి. బ్యాంకులకు దసరా సెలవులు ఎప్పుడనేది తెలుసుకుందాం.
అక్టోబర్ 11న త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అస్సోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, బీహార్, నాగాలాండ్, జార్ఖండ్, మేఖాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 12 న దేశమంతా విజయదశమి సందర్భంగా బ్యాంకులకు సెలవు. రెండవ శనివారం సెలవు కూడా ఇదే రోజు ఉంది
అక్టోబర్ 13 ఆదివారం సెలవు
ఆక్టోబర్ 14 దుర్గా పూజ సిక్కింలో సెలవు
ఇక అక్టోబర్ 17న వాల్మీకి జయంతి పురస్కరించుకుని కర్ణాటక, అస్సోం, హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా దేశమంతా బ్యాంకులకు సెలవు ఉంది.
Also read: Sun Transit 2024: అక్టోబర్ 17 నుంచి సూర్య గోచారం, ఈ 5 రాశులకు వద్దంటే డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.