Thala Ajith love life: తమిళ సూపర్ స్టార్ అజిత్ ప్రస్తుతం తన భార్య శాలినితో.. తన జీవితం సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆజిత్ మొదటి ప్రేమ శాలిని కాదు. అప్పట్లో ఒక హీరోయిన్ని ఎంతో గాఢంగా ప్రేమించాడు ఈ హీరో. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ తర్వాత ఏమైందో ఒకసారి చూద్దాం..
ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రముఖ హీరో అజిత్. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా లవర్ బాయ్ గా మంచి పేరు ఉండేది. ముఖ్యంగా అజిత్ నటించిన ప్రేమలేఖ చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ్ భాషలలో ఈ చిత్రం మంచి విజయం అందుకోవడంతో అజిత్ కి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాలో ఉన్నట్టుగానే అజిత్ లైఫ్ లో కూడా ఒక రియల్ లవ్ స్టోరీ ఉందని సమాచారం.
1990 లలో హీరోయిన్ హీరా రాజగోపాల్ ను అజిత్ గాఢంగా ప్రేమించారట. ఆ రోజుల్లో వీరి ఎఫైర్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా కూడా మారింది. అంతేకాదు ఆ రోజుల్లో సెట్స్ లో ఉన్నట్టుగానే అజిత్ ఆమెకు ఎన్నో లవ్ లెటర్స్ కూడా రాసినట్లు సమాచారం. అయితే అజిత్.. హీరా కు రాసిన లెటర్స్ ని తాను చదివాను అంటూ ప్రముఖ యాక్టర్ బాయిల్వాన్ రంగనాథన్ తెలిపారు. దీంతో వీరి లవ్ స్టోరీ మరొకసారి వార్తల్లో నిలిచింది.
కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరా ప్రేమలో అజిత్ మునిగిపోయారు. ఆ తర్వాత తోడారమ్ అనే మరో చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ మాత్రం పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. పీకల్లోతు వరకు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట మధ్యలోనే విడిపోవడానికి కారణం హీరా తల్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అలా అజిత్ - హీరా లవ్ స్టోరీ కి పులిస్టాప్ పడినట్లు సమాచారం. ఆ తర్వాత అజిత్ మరో హీరోయిన్ శాలిని ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అజిత్ మంచి విహారయాత్రికుడు.. బైక్ పైన విహారయాత్రలకు వెళ్తూ వివిధ ప్రాంతాలలో పలు విషయాలను, పలువురు వ్యక్తులను కలుస్తూ లోకజ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా తన అభిరుచిని చాటుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇక అజిత్ విషయానికి వస్తే వాలిమై సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా రికార్డులు కొల్లగొట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.