E-shram card benefits: అసంఘటిత రంగాల్లో పని చేసే వారికి సహాయం చేసేందుకు గానూ.. కేంద్రం లేబర్​ అండ్​ ఎంప్లాయ్​మెంట్​ మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 26న ఈ-శ్రమ్​ పోర్టల్​ను ప్రారంభించింది. వలస కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లల్లో పని చేసే వారు, వీధి వ్యాపారులు, వెయిటర్స్​, బ్యుటీషియన్స్​, హస్తకళా కార్మికులు, వ్యవసాయ కార్మికులు సహా.. వివిధ పనులు చేసే వారికోసం ఈ పోర్టల్​ను అందుబాటులోకి (e-shram card benefits) తెచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ-శ్రమ్​ కార్డు ఉపయోగాలు..


అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సమాజిక భద్రత సేవలను మరింత కచ్చితత్వంతో అందించాలనేదే దీని (e-shram card use) ముఖ్య ఉద్దేశం.


లేబర్​, ఎంప్లాయ్​మెంట్​ మంత్రిత్వ శాఖ సహా ఇతర శాఖలు అందించే సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.


అసంఘటిత రంగాల్లోని కార్మికుల డేటాబేస్ కోసం.. ఆధార్​ అనుసంధానంతో ఈ-శ్రమ్​ పోర్టల్​ను అభివృద్ధి చేసింది కేంద్రం.


ఈ-శ్రమ్​ పోర్టల్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద.. రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా (Insurance with e-shram card) వర్తిస్తుంది.


భవిష్యత్​లో అసంఘటిత  ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలన్నీ నేరుగా ఈ పోర్టల్​ ద్వారానే ఇచ్చే అవకాశముంది.


అత్యవసర పరిస్థితి ఏర్పడితే అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సహాయం చేసేందుకు కూడా ఈ పోర్టల్​ ఉపయోగపడనుంది.


కార్డు ఎలా పొందాలి?


అసంఘటిత రంగాల్లో పని చేసే 16-59 ఏళ్ల మధ్య వారు ఎవరైనా ఈ పోర్టలో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. సీఎస్​సీ, స్టేట్​ సేవా కేంద్ర (ఎస్​ఎస్​కే)లలో ఎక్కడైనా ఉచితంగా రిజిస్ట్రేషన్​ (How to get e-shram card) చేసుకోవచ్చు.


రిజిస్ట్రేషన్ పూర్తయిన వాళ్లకు.. 12 అంకెల యూఏఎన్​తో కూడిన ఈ-శ్రమ్​ కార్డును పొందుతారు. ఈ నంబర్​ వచ్చినవారు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సామాజిక సంక్షేమ పథకాల కింద ప్రయోజనాలు (e-shram card full details) పొందగలుగుతారు.


ఈ యూఏఎన్​ నంబర్ ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటుంది. ఇది శాశ్వత నంబర్​. అంటే ఒకవేళ కార్ట్​ పోయినా.. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆ నంబర్​తోనే కొత్త కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది.


సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?


  • ముందుగా ఈ 'E-Shram’ అధికారిక వెబ్​సైట్లోకి లాగిన్​ అవ్వాలి

  • మెయిన్​ పేజీలోనే రిజిస్ట్రేషన్​ అప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్​ చేయాలి

  • ఇక్కడ ఆధార్​తో లింక్ అయిన మొబైల్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఆ తర్వాత క్యాప్చా ఎంటర్​ చేసీ ఓటీపీపై క్లిక్​ చేయాలి

  • ఆధార్​తో లింకైన మొబైల్ నంబర్​కో ఓ ఓటీపీ వస్తుంది.. అప్పుడు ఈ-శ్రమ్​ రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్​ అవుతుంది

  • ఇందులో వ్యక్తిగత, విద్య సంబంధి వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా నంబర్​ వివరాలు సమర్పించాలి

  • అన్ని వివరాలు సమర్పించి సబ్మిట్​ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది


Also read: SBI: ప్రెగ్నెంట్ విమెన్ టెంపరరీ అన్‌ఫిట్.. ఆ గైడ్‌లైన్స్‌ను ఉపసంహరించుకున్న ఎస్‌బీఐ


Also read: Budget 2022: మోదీ సర్కార్ రాకతో బడ్జెట్ సాంప్రదాయాల్లో వచ్చిన మార్పులివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook