Gujarat earthquake | రాజ్‌కోట్: ఉత్తరాదిన తరచుగా ఏదో ఓ చోట సంభవిస్తున్న వరుస భూకంపాలు ( Serial earthquakes) అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, గుడ్‌గావ్, ఎన్సీఆర్, నొయిడా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు సర్వ సాధారణమయ్యాయి. ఒక్కోసారి వారం రోజుల వ్యవధిలోనే రెండుమూడుసార్లు భూమి కంపిస్తోంది. అయితే, అదృష్టవశాత్తుగా వాటి తీవ్రత అధికంగా ఉండకపోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం లేదు. తాజాగా సోమవారం మధ్యాహ్నం 12.57 గంటలకు గుజరాత్‌లోని రాజ్‌కోట్ వాయువ్య దిశలో 83 కిమీ దూరంలో భూకంపం సంభవించింది (Earthquake hits near Rajkot). నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ( భూకంపం అధ్యయనాల కేంద్రం) వెల్లడించిన వివరాల ప్రకారం రిక్టార్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.6 మేగ్నిట్యూడ్‌గా నమోదైంది. అయితే, భూకంపం తీవ్రత పెద్దదేమీ కానప్పటికీ.. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించడం అక్కడి వారిని ఆందోళనకు గురిచేసింది. ఈ భూకంపం ధాటికి కచ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  


( Read also : Sushant`s last rites: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 గంటకు మళ్లీ రెండోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.6 గా నమోదైంది. వరుసగా రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు మండుటెండలోనే ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ రెండు భూకంపాలకు భూకంపం కేంద్రం బచావుకి (Bhachau region) సమీపంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 


గత 24 గంటల వ్యవధిలో భూకంపం రావడం ఇది రెండోసారి. ఆదివారం రాత్రి 8.13 గంటలకు రాజ్‌కోట్‌కి వాయువ్య దిశలో 122 కిమీ దూరంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై (Richter Scale) ఈ భూకంపం తీవ్రత 5.8గా నమోదైంది. Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లవ్ స్టోరీ, బ్రేకప్ ) 


గుజరాత్‌లో ఇప్పటివరకు మూడుసార్లు భారీ భూకంపాలు సంభవించాయి. గుజరాత్‌లో సంభవించిన భారీ భూకంపాలలో మొదటిది 1918లో కాగా, 1956లో రెండోసారి, 2001 మూడోసారి సంభవించిన భూకంపం గుజరాత్‌ని గజగజా వణికించింది. 2001, జనవరి 26న వచ్చిన ఈ భూకంపం ధాటికి దాదాపు 100 సెకన్లపాటు భూమి కంపించింది. దీని తీవ్రత 6.9గా నమోదైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..