Sushant Singh Rajput suicide | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులను తీవ్రంగా షాక్‌కి గురిచేసింది. చేసింది కొన్ని సినిమాలే అయినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అడపాదడపా సినిమాల్లో అవకాశం అందుకుంటూనే ఉన్న సుశాంత్‌కి ఆత్మహత్య చేసుకోవాల్సినంత సమస్యలు ఏమున్నాయంటూ కొంతమంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా యుక్త వయస్సులో ఉన్న వారు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది వారి పర్సనల్ లైఫ్ విషయాలే. అందులోనూ ఎక్కువగా వారికేమైనా లవ్ స్టోరీలు ఉంటే.. అవి సక్సెస్ కాకపోవడం వల్ల సూసైడ్ చేసుకున్నారా అనే సందేహాలే ఎక్కువ వ్యక్తమవుతుంటాయి. లేదంటే కోరుకున్న రంగంలో అవకాశాలు దక్కడం లేదనే ఆవేదనతో అర్థాంతరంగా తనువు చాలించిన వారూ ఉన్నారు. ఏదేమైనా ఆత్మహత్య అనేది సమర్థించదగిన విషయమైతే కాదు. ( వైరల్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి INSTAGRAM POST )
అయితే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లవ్ స్టోరీ విషయానికొస్తే.. 2009లో హిందీలో ప్రారంభమైన పవిత్ర రిశ్తా ( పవిత్ర సంబంధం) అనే టీవీ సీరియల్ ద్వారా సుశాంత్ బుల్లితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్‌లో సుశాంత్ ప్రధాన పాత్ర పోషించి టీవీ ఆడియెన్స్‌ని మెప్పించాడు. ఇదే సీరియల్‌లో తనకి జోడీగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్ ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు వీళ్ల ప్రేమాయణం కొనసాగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అంకిత లోఖండే ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఒకరిద్దరిని అతడు డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు వచ్చినా... అవి పుకార్లుగానే ఉండిపోయాయి. హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..