న్యూఢిల్లీ: హర్యానాలోని సోనిపట్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0గా నమోదైంది. భూకంపం రావడంతో ఇళ్లు, కార్యాలయాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  


ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిసేపు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో రాజధాని ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. మధ్యాహ్నం 3.37 గంటల ప్రాంతంలో భూమి పలుమార్లు కంపించింది. భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.