Earthquake: ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు
దేశంలోని పలుచోట్ల గురువారం అర్థరాత్రి భూప్రకంపనలు ( Earthquake ) సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, నోయిడా, గురుగ్రామ్, రాజస్థాన్‌లోని పలుచోట్ల రాత్రి 11.46 గంటల సమయంలో భూమి కంపించింది.
Earthquake of magnitude 4.2 hits Delhi-NCR: న్యూఢిల్లీ: దేశంలోని పలుచోట్ల గురువారం అర్థరాత్రి భూప్రకంపనలు ( Earthquake ) సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, నోయిడా, గురుగ్రామ్, రాజస్థాన్‌లోని పలుచోట్ల రాత్రి 11.46 గంటల సమయంలో భూమి కంపించింది. అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ
ఈ భూకంప కేంద్రం రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR), నోయిడా, గురుగ్రామ్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. కొన్ని నెలలుగా ఢిల్లీ ( Delhi ) సహా పలు ప్రాంతాల్లో అడపాదడపా భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి.
Also read; Farmer protests: వ్యవసాయ చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook