Earthquake in India today: రాజస్థాన్‌లోని బికనీర్‌లో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు సంభవించింది. ఈ భూకంపం 28.40 అక్షాంశం మరియు 68.06 రేఖాంశం వద్ద 8 కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్‌లో శనివారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది.  తాజా భూకంప కేంద్రం బికనీర్‌కు 516 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రకంపనల ధాటికి ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు బయటకు వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరుణాచల్ ప్రదేశ్ భూకంపం సంభవించిన అరగంట తర్వాత రాజస్థాన్‌లోని బికనీర్‌లో ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఈ రెండు భూకంప ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో భూకంపాలు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో కూడా శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది.


నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఉదయం 10:31 గంటలకు 4.0 తీవ్రతతో, అంబికాపూర్ ఛత్తీస్‌గఢ్ సమీపంలో ఉదయం 10:28 గంటలకు 3.9 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దాదాపు ఆరు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లలో కూడా భూకంపం ఏర్పడింది. 


Also Read: Home Insurance: భూకంపంలో ఇల్లు కూలిపోతే ఆర్థిక సహాయం.. వెంటనే ఈ పని చేయండి


Also Read: Taraka Ratna Wife Alekhya Reddy : ఏడిపించేస్తోన్న తారక రత్న భార్య పోస్ట్.. భర్త జ్ఞాపకాల్లో అలేఖ్య రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి