Best Home Insurance In India: ఇటీవల వరుస భూకంప ఘటనలు ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. టర్కీ, సిరియాలను వణికించిన భూకంపం.. మెల్లగా ప్రపంచ దేశాలను సైతం భయపెడుతున్నాయి. భూకంపాలతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లుతోంది. ముఖ్యంగా ఇళ్లు కూలిపోతుండడంతో భూకంప బాధితులు నిరాశ్రయులుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో మీ ఇంటికి ముందే బీమా చేయించుకుంటే విపత్తుల సమయంలో కూలిపోయినా మీరు ఇన్సురెన్స్ కవర్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
హోమ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఇంటికి లేదా ఏదైనా బీమా చేసిన ఆస్తికి అయ్యే ఖర్చు, నష్టాలను కవర్ చేసే బీమా పాలసీ. ఇది ఆస్తి బీమా అనేక రకాలుగా ఉంటుంది. గృహ బీమాను ఇంటి యజమాని బీమా అని కూడా అంటారు. ఇది మీ బంగ్లా/అపార్ట్‌మెంట్/అద్దె ఫ్లాట్/సొంతమైన ఇల్లు/తయారీ చేసిన ఇంటిని అనుకోని ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఏదైనా దురదృష్టకర సంఘటన కారణంగా జరిగే నష్టాల నుంచి మీకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది.
హోమ్ ఇన్సురెన్స్ తుఫాను, వడగళ్లు, అగ్ని లేదా పిడుగు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుంది. అదే సమయంలో కొన్ని పరిస్థితులలో ప్రజలకు యాక్ట్ ఆఫ్ గాడ్ కింద గృహ బీమా కింద కూడా కవరేజీ అందుతుంది. అనేక గృహ బీమా పాలసీలు యాక్ట్ ఆఫ్ గాడ్ ప్రకారం వరదలు, భూకంపం వంటి విపత్తులపై కవరేజీని అందించవు. కానీ కొన్ని కంపెనీలు ప్రత్యేక సందర్భాలలో లేదా అనుకూలీకరించిన పాలసీలలో ఈ విపత్తుల కోసం అదనపు కవరేజీని అందిస్తాయి. ఇది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
అల్లర్లు, దొంగతనం, విధ్వంసం లేదా ఆస్తి విధ్వంసం, రైలు లేదా రోడ్డు నిర్మాణం కారణంగా నష్టం, విమానం లేదా ఏదైనా వాహనం (మీ స్వంతం కాదు), పేలుడు లేదా పొగ వంటి మానవ తప్పిదాలపై కూడా గృహ బీమా క్లెయిమ్ చేయవచ్చు. అంతేకాకుండా కొన్ని గృహ బీమా పాలసీలు ఇంట్లో ఉంచిన వస్తువులపై కూడా కవరేజీని అందిస్తాయి. అయితే వివిధ కంపెనీల ద్వారా అందించే గృహ బీమాలో కవరేజీ మారవచ్చు. మంచి పాలసీని చెక్ చేసుకుని మీరు హోమ్ ఇన్సురెన్స్‌ను తీసుకోవచ్చు.
Also Read: Ind Vs Aus 3rd Odi Updates: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. షాక్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్
Also Read: Ind Vs Aus: రాణించిన బౌలర్లు.. భారత్ లక్ష్యం ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి