న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో ఇప్పుడు మరో విపత్తు కలవరపెడుతోంది. ఉత్తరాదిలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని (Earthquake tremors) భూప్రకంపనలు భయపెడుతున్నాయి. ఢిల్లీలో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనం వణికిపోయారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీకి వాయువ్య దిశలో 49 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఈఎంఎస్సీ సంస్థ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.6గా నమోదయినట్లు వెల్లడించింది. కాగా, గత నెలలోనూ ఢిల్లీలో భూమి కంపించింది. ఏప్రిల్ 12, 13న పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: coronavirus test samples: కరోనా శాంపిళ్ళను లాక్కున్న కోతి..


గత యాభై రోజుల్లో ఢిల్లీలో భూ ప్రకంపనలు రావడం ఐదోసారి.. కాగా  ఈ సారి 4. 6 గా నమోదుకావడంతో కొన్ని సెకనుల పాటు భూమి కంపించడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళలనలతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లోని (Noida) నోయిడా, (Haryana) హర్యానా-ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..