హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ విడుదలైంది. నవంబర్ 9న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసి ప్రకటించింది. ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తన్నట్లు వెల్లడించింది.  కాగా డిసెంబర్ 18న ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీఈసీ ఏకే జ్యోతి పేర్కొన్నారు. ఒక్కో అభ్యర్ధి ఎన్నికల ఖర్చు రూ.25 లక్షల మించకుండా.. పరిమితులు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు వీవీ ప్యాడ్ ల వినియోగిస్తున్న ట్లు ఈ సందర్భంగా సీఈసీ ఏకే జ్యోతి వెల్లడించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో  మొత్తం 49 లక్షల 5 వేల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 20 వేల మంది కొత్త ఓటర్లు ఉండటం విశేషం. కాగా ఎన్నికల నిర్వహణకు 7 వేల 5 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 68 మంది సభ్యులు గల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు 2018 జనవరి 7తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.


హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. హిమాచల్ ప్రదేశ్‌ విషయంలో సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను రాహుల్ ఇప్పటికే ప్రకటించి రెండు విడతల ప్రచారం కూడా సాగించారు. అయితే వీరభద్ర సింగ్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు, వాటిపై పలు ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతుండంతో బీజేపేకే ప్రజలు పట్టం కట్టడం తథ్యమని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది.