Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్
EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌కు భారీ షాక్ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
Big Shock To Shyam Rangeela: లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వారణాసి లోక్‌సభ స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తుండడం దేశం దృష్టి వారణాసిపై పడింది. నామినేషన్ దాఖలుకు ఎన్డీయే పక్షాలన్నింటిని పిలిచి బల ప్రదర్శన చేసిన మోదీ మరోసారి విజయంపై ధీమాతో ఉన్నారు. అయితే పదేళ్ల మోదీ పాలనపై విమర్శిస్తూ.. మోదీపై కొంత మంది పోటీకి దిగారు. మోదీ చేసిన మోసాలు, అప్రజాస్వామిక పాలనను గుర్తు చేస్తూ కొందరు సామాజిక కార్యకర్తలు, రైతులతోపాటు మరికొందరు వారణాసి నుంచి పోటీకి దిగారు. ఈ క్రమంలోనే మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి భారీ షాక్ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
Also Read: KTR: అత్యధిక ఎంపీ స్థానాలు మావే.. ఎన్నికల్లో 'కారు'దే తిరుగులేని విజయం
హాస్య నటుడిగా గుర్తింపు పొందిన 29 ఏళ్ల శ్యామ్ రంగీలా వారణాసి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డాడు. ఈనెల 14వ తేదీన నరేంద్ర మోదీపై పోటీ చేస్తూ నామినేషన్ పత్రాలను సమర్పించాడు. అయితే మరుసటి రోజు అంటే మే 15వ తేదీన ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించారు. స్క్రూట్నీ చేయగా శ్యామ్ సమర్పించిన నామినేషన్ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా లేదు. ఈ కారణం చేత అతడి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్ తిరస్కరణతో శ్యామ్ రంగీలాకు భారీ షాక్ తగిలింది. అయితే అధికారులు దురుద్దేశంతో తన నామినేషన్‌ను తిరస్కరించినట్లు శ్యామ్ ఆరోపిస్తున్నాడు.
Also Read: Narendra Modi Assets: ఇల్లు, కారు లేని ప్రధాని మోదీ.. ఆయన ఆస్తులు ఎంతో తెలుసా?
శ్యామ్ ఎవరు?
రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్ జిల్లాలోని మనక్‌తేరి బరనీ గ్రామంలో శ్యామ్ జన్మించాడు. 1994లో జన్మించిన అతడి అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. ఇప్పుడు అదే వృత్తిగా మార్చుకున్నాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్‌ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచి శ్యామ్‌కు విశేష గుర్తింపు లభించింది. అంతేకాదు రాహుల్ గాంధీ గొంతును అచ్చం అలానే శ్యామ్ చేస్తాడు.
అయితే ప్రధాని గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్‌కు వేధింపులు మొదలయ్యాయి. పదేళ్లుగా మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని గుర్తించిన శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపాడు. ఈ ఆక్రోశంతో ప్రస్తుతం వారణాసి నుంచి ప్రధాని మోదీపై శ్యామ్ రంగీలా పోటీకి దిగాడు. అయితే అనూహ్యంగా ఎన్నికల అధికారులు అతడి నామినేషన్‌ను తిరస్కరించారు. పోటీలో నుంచి వైదొలిగినా ప్రధాని మోదీపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా శ్యామ్ వర్గీయులు చెబుతున్నారు. కాగా వారణాసి లోక్‌సభ స్థానానికి ఏడో విడతలో అంటే జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన దేశంలోని అన్ని స్థానాలకు ఫలితాలు వెల్లడించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter