ED Recovers Huge Amount: సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాదు ప్రజలకు ఓటుకు నోటు కోసం పంచేందుక ఉంచుకున్న కొంత మంది రాజకీయ నాయకులు వద్ద ఉన్న అక్రమ నగదును ఈడీ స్వాధీనం చేసుకుంటుంది. తమకు అందించిన సమాచారంతో అక్రమార్కులపై దండయాత్ర మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఝర్ఖండ్ రాష్ట్రంలో ఓ మంత్రికి చెందిన సహాయకుడి ఇంట్లో లెక్కలోకి రానీ గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న సొమ్ము దాదాపు రూ. 20 కోట్ల వరకు ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఝర్ఖండ్ క్యాపిటల్ సిటీ రాంచీ నగరంలో సోమవారం ఈడీ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఝార్ఖండ్‌ గ్రామీణాభిద్ధి శాఖలో పనిచేసిన ఎక్స్ ఛీప్ ఇంజినీర్ వీరేంద్ర రాయ్ 2023లో అరెస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సమాచారం మేరకు 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాక మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కరెన్స కట్టలు ఉన్న దృష్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఝర్ఖండ్‌ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అవినీతి పోలేదు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ అయినా.. మంత్రుల్లో మాత్రం అవినీతి పోలేదన్నారు. ఈ నగదు పట్టుబడటంపై ఝార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.


ఝర్ఖండ్ ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతికి పాల్పడి రూ. 100 కోట్ల మేర కూడబెట్టారని వీరేంద్రపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈయన అవినీతి ఎవరెవరికీ ఎంత మేర లంచాలు ఇచ్చారనే వివరాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నిరు. అందులోని సమాచారంతో మరిన్ని దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి. ఇందులో ఇంకా ఎవరెరుఉన్నారనే విషయమై కూపీ లాగుతోంది ఈడీ.


Also read: Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter