దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన కేరళ గోల్డ్ స్కామ్ ( Kerala Gold scam ) లో విచారణ ముమ్మరమైంది. ఈ కేసును విచారిస్తున్న ఈడీ ( ED ) ( Enforcement Directorate )..303 పేజీల ఛార్జిషీటు దాఖలు చేసింది. కేరళ గోల్డ్ స్కామ్ లో కీలకమైన వ్యక్తులపై అభియోగాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ ( Tiruvanantapuram Airport ) లో జూలై నెలలో 30 కిలోల బంగారం అక్రమంగా సరఫరా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి కారణం ఈ కేసులో పెద్ద పెద్ద వ్యక్తులు, రాజకీయనేతల పాత్రపై అభియోగాలొచ్చాయి.  ఈ కేసు విచారణ చేస్తున్న ఈడీ ముగ్గురు నిందితులతో పాటు 25 మంది సాక్ష్యుల్ని విచారించింది. 303 పేజీల చార్జిషీట్‌ను ఈడీ బుధవారం దాఖలు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శివశంకర్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 12, 15న శివ శంకర్ స్టేట్‌మెంట్‌ను ఈడీ  రికార్డ్ చేసింది. స్వప్న సురేష్‌తో కలిసి తన చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ తో‌ పాటు ఆయన ఎస్‌బీఐలో జాయింట్ బ్యాంక్ లాకర్ తెరిచారు. 


గోల్డ్ స్మగ్లింగ్ ( Gold Smuggling )  చేయటంలో స్వప్న సురేష్  కీలక సూత్రధారి అని ఈడీ నిర్థారించింది. స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును, బంగారాన్ని స్వప్న బ్యాంకు లాకర్లలో భద్ర పరిచింది. ఇప్పటికే బ్యాంకు లాకర్లను ఎన్‌ఐఏ అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో ఏ2 నిందితురాలు స్వప్న సురేష్‌తో 2017 నుంచి తనకు  పరిచయం ఉన్నట్టు మాజీ ఐఏఎస్‌ అధికారి తెలిపారు. స్వప్న కుటుంబం సభ్యులతోనూ మాజీ ఐఏఎస్ కు సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది.  


మరోవైపు కన్నడనాట కలకలం రేపుతున్న డ్రగ్స్‌ మాఫియా వ్యవహారానికి కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంగతి స్వయంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) లోని ఓ సీనియ‌ర్ అధికారి వెల్ల‌డించారు. బెంగుళూరు మాద‌క‌ద్ర‌వ్యాల కేసు ( Bangalore Drugs case ) లో కీల‌క  నిందితుడు డ్రగ్‌ పెడ్లర్‌ మహ్మద్‌ అనూప్, కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో నిందితుడు  కె టి రమీస్‌ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తుంది. ఇద్ద‌రి మధ్య నిత్యం  సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని అధికారి పేర్కొన్నారు. మొద‌టినుంచి ఈ రెండు కేసుల‌కి మ‌ధ్య సంబంధాలున్నాయ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే తాజాగా నిందితుల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లు అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూర్చాయి. ఇప్ప‌టికే ఎన్‌సిబి అధికారులు మ‌హ్మ‌ద్ అనూప్ స‌హా మ‌రో ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి  తీసుకున్నారు. Also read: Tamil nadu: అన్నాడీఎంకే సీఎం అభ్యర్ధిగా మరోసారి పళనిస్వామికి అవకాశం