West Bengal Assembly Elections 2021: మమతా బెనర్జీ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం
West Bengal Assembly Elections 2021: తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారంపై ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది.
West Bengal Assembly Elections 2021: తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారంపై ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల(West Bengal Assembly Elections)ప్రచారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార పార్టీ టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వేటు పడింది. 24 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాల్సిందిగా ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్ధించడం, కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం(Election Commission)స్పందించింది. 24 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదదని నిషేధం విధించింది. ఏప్రిల్ 12 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అనుచిత వ్యాఖ్యలు బహిరంగంగా చేయవద్దని ఆదేశించింది.
షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో కీలకాంశాల్ని మమతా బెనర్జీ కావాలనే దాటేశారని ఈసీ వ్యాఖ్యానించింది. ఇక ఈసీ నిర్ణయంపై మమతా బెనర్జీ (Mamata Banerjee)తీవ్రంగా స్పందించారు. ఈ నిషేధం రాజ్యాంగ విరుద్ధమని..దీనికి నిరసనగా కోల్‌కత్తాలో ధర్నాకు దిగుతానని ప్రకటించారు.ఈసీ నిష్పక్షపాక్షికతపై ముందు నుంచీ అనుమనానాలున్నాయని...టీఎంసీ వ్యాఖ్యానించింది. మమతపై విధించిన నిషేధంతో ఈసీ వేసుకున్న ముసుగు కాస్తా తొలగిపోయిందని..ఎన్నికల సంఘం పూర్తిగా మోదీ, అమిత్ షా(Amit Shah)ఆదేశాల మేరకే పనిచేస్తుందనేది స్పష్టమైందని టీఎంసీ తెలిపింది.
Also read: Asad versus Mamata: మమతా బెనర్జీపై తీవ్రంగా విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook