మొన్న సీఎం కాన్వాయ్.. నేడు హెలీక్యాప్టర్ని చెక్ చేసిన ఇసి
మొన్న సీఎం కాన్వాయ్.. నేడు హెలీక్యాప్టర్ని చెక్ చేసిన ఇసి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఉపయోగిస్తున్న అన్ని రకాల వాహనాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన తనిఖీల బృందం వరుసగా సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా గురువారం నాడు ఆయన ఉపయోగిస్తున్న హెలీక్యాప్టర్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం తనిఖీ చేసింది. హెలీక్యాప్టర్‌తో పాటు అందులోని లగేజీని సైతం ఇసి అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉత్తర కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది.
[[{"fid":"178026","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇటీవల కుమారస్వామి ప్రయణిస్తున్న కాన్వాయ్‌ని సైతం హైవేపై దారి మధ్యలో ఆపేసిన కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీల బృందం రోడ్డుపైనే ఆయన కాన్వాయ్‌లోని అన్ని వాహనాలను తనిఖీ చేసిన సంగతి తెలిసిందే.