Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వర్సెస్ ప్రముఖ వ్యక్తుల భేటీ వెనుక కారణమేంటి..థర్డ్‌ఫ్రంట్ కోసమా..లేదా మరో కారణముందా. శరద్ పవార్‌కు రాష్ట్రపతి పదవి కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారా. అసలేం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో(West Bengal Elections)భారీ విజయం తరువాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరో బాథ్యత చేపట్టారు. ఈసారి చేపట్టిన ప్రాజెక్టు వెనుక రకరకాల కారణాలు విన్పిస్తున్నాయి. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను రెండు సార్లు భేటీ అయ్యారు.చివరిసారిగా జూన్ 11 న ముంబైలో సమావేశమయ్యారు. అనంతరం తాజాగా కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో భేటీ అయ్యారు. ఈ భేటీల వెనుక కారణమేంటనేదానిపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ భేటీల వెనుక థర్డ్‌ఫ్రంట్ ఆలోచన ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ను థర్డ్‌ఫ్రంట్‌లో చేర్చేందుకే రాహుల్, ప్రియాంకాలతో సమావేశమయ్యారనే వార్తలు వచ్చాయి. 


ఇప్పుడు తాజాగా మరో వాదన తెరపైకొచ్చింది.శరద్ పవార్‌(Sharad Pawar)ను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకే ప్రశాంత్ కిశోర్ (Prashant kishor)ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే లాబీయింగ్ ప్రారంభిచారనే వార్త రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంపై శరద్ పవార్ వెంటనే స్పందించారు. ఈ వార్తలన్నీ నిరాధారమైనవని..అసత్యపు ప్రచారాలని కొట్టిపారేశారు. ఏ ప్రాతిపదికన తనను రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించాలనుకున్నారో తనకు తెలియదని శరద్ పవార్ తెలిపారు. తమ భేటీలో ఈ తరహా అంశాలు చర్చకు రాలేదన్నారు. 2024 సాధారణ ఎన్నికలు కూడా చర్చనీయాంశం కాలేదని చెప్పారు. 


Also read: Kerala Lockdown: పెరుగుతున్న కరోనా ఉధృతి, మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook