Prashant Kishor: సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త భేటీ.. మూడు రోజుల్లో రెండోసారి!
Prashant Kishor meets Sonia Gandhi. తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల్లోనే రెండో సారి భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
Prashant Kishor meets Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఫోకస్ పెట్టారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం ఆమె దృష్టి సారించారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల్లోనే రెండో సారి భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన సమావేశంలో దేశంలో జరుగుతున్న తాజా రాజకీయలు, పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీతో పాటు రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, అంబికా సోని, ప్రియాంక గాంధీ, పలువురు పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందస్తు ప్రణాళికలను కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వివరించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం.
దేశంలో 2024లో జరగనున్న లోక్‌సభ ఎలక్షన్‌లకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో గత శనివారం జరిగిన సమావేశంలో ప్రశాంత్ కిషోర్ బ్లూ ప్రింట్ సమర్పించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 270 లోక్‌సభ స్థానాలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పీకే కోరారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్టు సమాచారం. పీకే నివేదిక ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలైన ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ కూటములు పెట్టుకోవద్దని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ నివేదిక సమర్పించిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. కూటముల కోసం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలను సూచించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గడిచిన మూడు రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో రెండు సార్లు భేటీ అవడం, పొలిటికల్‌గా యాక్టివ్ అవడంతో త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ రూపొందించిన బ్లూ ప్రింట్‌ను అమలు చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ కిషోర్ బ్లూ ప్రింట్‌ను పాటించనున్నారని టాక్.
Also Read: Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్
Also Read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook