Elections results 2024 bjp party in lead towards hattrick in Haryana: ప్రస్తుతం  రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల  కౌంటింగ్ నడుస్తోంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకొవచ్చు. జమ్ములో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. అదే విధంగా హర్యానాలో బీజేపీకి ఈ ఎన్నికలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పుకొవచ్చు. హర్యానాలో హెట్రిక్ సంప్రదాయన్ని క్రియేట్ చేసిన చరిత్ర బీజేపీ సొంతం చేసుకొవాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. హర్యానాలో, జమ్ము కశ్మీర్ లలోను మొత్తంగా 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ, జమ్ములో హంగ్ అంటూ ఎగ్జీట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి ఎన్నికల ఫలితల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే.. హర్యానాలో మాత్రం కౌంటింగ్ ప్రారంభించగానే.. కాంగ్రెస్ ముందంజలో ఉంది.


బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించగానే.. దాదాపు.. 50 కిపైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. దీంతో బీజేపీకీ కనీసం 20 అయిన వస్తాయో లేదా అనుకున్నాయి. అయితే.. అనుకొని విధంగా.. బీజేపీ మరల పుంజుకుంది.  ప్రస్తుతం హర్యానాలో ఏపార్టీ అయిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 46కు స్థానాలు గెలవాలి. బీజేపీ ఇప్పటికే.. 46 స్థానాల్లో ముందజంలో ఉంది.


అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం.. 37 స్థానాలకు పరిమితమైంది.  అదే విధంగా ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.ఈ నేపథ్యంలో మరికొన్ని రౌండ్ లు మాత్రం మిగిలి ఉన్నాయి. అయితే.. బీజేపీ మాత్రంస్పష్టమైన ఆధిక్యంలో ముందుకు కొనసాగుతుంది.  ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాలు టీ20 మ్యాన్ లను తలపిస్తున్నాయని చెప్పుకొవచ్చు. 


జమ్ములోను బీజేపీ హావా..


మరోవైపు జమ్ములో కూడా బీజేపీ హాల్ చల్ కొనసాగుతుంది. జమ్ములో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే విధంగా బీజేపీ 27 స్థానాల్లోను, పీడీపీ 3, కాంగ్రెస్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇండిపెండెంట్ లు.. 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


Read more: Haryana results 2024: నరాలు తేగే ఉత్కంఠ.. ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం.. వీడియో వైరల్..


మొత్తంగా పూర్తి అప్ డేట్ కోసం ఇంకా కొన్ని గంటలు వేచి చూడాల్సిన అవసం ఉంది.ఈ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీలు ఒంటరిగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు పొత్తులు పెట్టుకున్నాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter