Haryana results 2024: నరాలు తేగే ఉత్కంఠ.. ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం.. వీడియో వైరల్..

Bhupinder singh: హర్యానాలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  బీజీపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా .. నేనా అన్న విధంగా రౌండ్ .. రౌండ్ కు కూడా అంచనాలు మారిపోతున్నాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 8, 2024, 12:36 PM IST
  • హర్యానాలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్..
  • ధీమా వ్యక్తం చేసిన మాజీ సీఎం..
Haryana results 2024: నరాలు తేగే ఉత్కంఠ.. ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం.. వీడియో వైరల్..

Ex cm Bhupinder singh hood on Haryana elections results 2024: దేశంలో ప్రస్తుతం మరోసారి ఎన్నికల ఫలితాల హైటెన్షన్ నెలకొంది. ఈనేపథ్యంలో ముఖ్యంగా హర్యానా, జమ్ము కశ్మీర్ లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే.. రెండు స్టేట్స్ లు  కూడా ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకొవచ్చు. జమ్ములో పదేళ్ల తర్వాత ఎన్నికల జరిగాయి. మరోవైపు హర్యానాలో..ఈసారి బీజీపీ హ్యాట్రిక్ సాధించాలని కూడా ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జీట్ పోల్స్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్, జమ్ములో మళ్లీ సంకీర్ణమంటూ చెప్పుకొచ్చాయి.

 

అయితే.. ఈరోజు ( మంగళవారం) ఓట్ల లెక్కింపు మాత్రం ప్రారంభమైంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ఫలితాల వేళ.. మొదట ఓట్ల లెక్కింపు ప్రారంభించగానే.. హర్యానాలో కాంగ్రెస్ ముందుంది.  అయితే..ప్రస్తుతం మాత్రం..మరల బీజేపీ ముందంజలో నిలిచింది. అయితే.. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.

పూర్తి వివరాలు..

హర్యానాలో ఎన్నికల ఫలితాల టెన్షన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా.. మాత్రం కాంగ్రెస్ గెలవడం పక్కా.. అంటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వలేదని, కాంగ్రెస్ మాత్రమే సర్కారు ఏర్పాటు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతుందని, అదే విధంగా మరికొన్ని రౌండ్ లు మిగిలి ఉన్నాయని, తాము మంచి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భూపిందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ కొన్నిస్థానాలు అటు ఇటుగా వస్తే.. ఇండిపెండెంట్ లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తామంటూ కూడా భూపిందర్ సింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఈక్రమంలో ప్రస్తుతం హర్యానాలో మాత్రం రౌండ్ రౌండ్ కూడా కాంగ్రెస్ లు, బీజేపీలు మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.  పూర్తి రిజల్ట్ కోసం ఇంకాస్త సమయం వేచీచూడాల్సి ఉంది.  అయితే.. హర్యానలో గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. గతంలో రెండు మార్లు కాంగ్రెస్ గెలిస్తే.. ఆ తర్వాత మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Read more: Haryana Election Result: హర్యానాలో పుంజుకున్న బీజేపీ.. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు..

అందుకే ఈ ఎన్నికలు మాత్రం హర్యానాలో కాకుండా.. దేశంలోనే హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. హర్యానలో ఎన్నికల ఫలితాలలో ముందంజలో ఉన్న నేపథ్యంలో.. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News