No registration certificate fees and renewal charges for Electric Vehicles: డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు మరోవైపు ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగినట్టుగానే కాలుష్యం కారణంగా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను నివారించేందుకు ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) తయారీదారులు కూడా పోటాపోటీగా అత్యాధునిక హంగులతో వాహనాలను తయారు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవన్నీ ఇలా ఉంటే, తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫీజుతో (RC fees) పాటు రెన్యూవల్ చార్జీల నుంచి వాహనదారులకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 


ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విషయంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఈ-స్కూటర్​, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు కోసం అయ్యే ఖర్చు కనీసం రూ. 1000 మేర తగ్గనుందని ఆటోమొబైల్​ డీలర్స్​​ అసోసియేషన్ స్పష్టంచేసింది. అంతేకాకుండా ఈ-స్కూటర్లు, ఎలక్ట్రిక్​ కార్లు (Electric cars)​ కొనుగోళ్లు ఇంకొంత మేరకు పెరుగుతాయని ఆటోమొబైల్​ డీలర్స్​​ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది.