Emrs Tribal Gov In Recruitment 2023: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRSs)లో ఖాళీగా ఉన్న 10,391 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేన్లు విడుదల అవ్వగా.. గురువారంతో గడువు ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు emrs.tribal.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్, పీజీటీ, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ), ల్యాబ్ అటెండెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NCTC ద్వారా గుర్తింపు పొందిన మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ BED, MED డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా PGT, TGT ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నియమకానికి జూన్ నెల చివరలో 4,062 పోస్టులకు.. ఆ తరువాత కొద్ది రోజులకు మరో 6,329 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్ల కింద మొత్తం 10,391 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆకర్షణీయ వేతనాలు అందుకోనున్నారు. పూర్తి వివరాలను https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.


మొదటి నోటిఫికేషన్‌లోని 4062 పోస్టుల ఖాళీల వివరాలు ఇలా..


==> ప్రిన్సిపాల్-303


==> PGT-2266


==> అకౌంటెంట్-361


==> జేఎస్‌ఏ-759


==> ల్యాబ్ అటెండెంట్- 373


రెండో నోటిఫికేషన్‌లోని 6,329 పోస్టుల ఖాళీల వివరాలు ఇలా..


==> ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌-5660
==> హాస్టల్‌ వార్డెన్‌ పురుషుల విభాగం-335, మహిళల విభాగం- 334.


దరఖాస్తుకు అప్లై చేసుకునేందుకు పోస్టులను బట్టి ఫీజులు మారుతుంటాయి. ప్రిన్సిపల్ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.2 వేలు, PGT రూ.1500, నాన్ టీచింగ్ రూ.1000, SC/ ST/ PwD క్యాటగిరీలకు ఉచితం.


జీతాలు ఇలా..


==> ప్రిన్సిపాల్ -రూ.78800-209200/-
==> పీజీటీ -రూ.47600-151100/-
==> అకౌంటెంట్ - రూ.35400-112400/-
==> JSA-రూ.19900-63200/-
==> ల్యాబ్ అటెండెంట్ -రూ.18000-56900.


ఇది కూడా చదవండి: IND vs BAN World Cup 2023: రేపే బంగ్లాదేశ్‌తో భారత్ పోరు.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా..? పిచ్ రిపోర్ట్ ఇలా..!  


ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.