ED Files MoneyLanundering Case Against Kerala CM Pinarayi Vijayan Daughter Veena: ఒక వైపు దేశంలో సమ్మర్ హీట్ కొనసాగుతుండగా.. దీనికి రెట్టింపు వేడిని ఈడీ పుట్టిస్తుంది. ఇప్పటికే ఈడీ దూకుడు ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లను అరెస్టు చేసింది. కవితను తాజాగా, రౌస్ అవెన్యూ కోర్టు, తీహార్ జైలుకు  పంపించింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో అపోసిషన్ పార్టీలను లేకుండా బీజేపీ, ఈడీ, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని కూడా అపోసిషన్ లీడర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Snake Facts: పాముశరీరంలోని ఆ భాగం ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు..


తాజాగా, కవిత చేసిన వ్యాఖ్యలు ఈడీ మనీలాండరీంగ్ దాడులు కావాని,పొలిటికల్ లాండరీంగ్ కేసులంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. కేరళలో ఎన్నికల ముందు అధికార పార్టీకీ ఈడీ అధికారులు షాకిచ్చారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు..వీణా విజయన్ పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.  వీణతో పాటు,  మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసును దాఖలు చేసినట్లు సమాచారం.  


వీణ,  ఒక ప్రైవేట్ ఖనిజ సంస్థ అక్రమంగా చెల్లింపులు చేసిందన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకుగాను ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఏజెన్సీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను పిలిపించాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఈడీ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.


Read More: Viral Video: స్కూల్ టీచర్ ను చెప్పులతో కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్..


కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీ 2018 నుండి 2019 వరకు వీణా కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు రూ. 1.72 కోట్ల అక్రమ చెల్లింపు చేసిందని ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం కూతురుకు ఈడీ కేసులు నమోదు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి