Donald Trump Visit in India: భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్.. కూలిన స్వాగత ద్వారాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో పలు ముఖ్య కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
అహ్మదాబాద్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు. సోమవారం తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి భారత్ చేరుకోనున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టారు. మురికివాడలు కనిపించకుండా చూడటంలో భాగంగా గోడలు సైతం నిర్మించడం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.
Also Read: భారత్ కు బయలుదేరిన ట్రంప్, ఇదిగో వీడియో
డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరా వద్ద ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కుప్పకూలింది. అమెరికా నుంచి భారత్‌కు ట్రంప్ బయలుదేరే కొన్ని గంటల ముందు.. ఆదివారం నాడు స్డేడియం వెలుపల ఏర్పాటు చేసిన స్వాగత దూరం కూలిపోయింది. స్టేడియం ప్రాంగణంలో నమస్తే ట్రంప్, వెల్ కమ్ ట్రంప్ అని భారీగా హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే స్వాగత ద్వారం కూలిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: ‘నమస్తే ట్రంప్’ నుంచి బై బై ట్రంప్ వరకు
ఆ సమయంలో స్వాగత ద్వారం పక్కన ఎవరూ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. అహ్మదాబాద్‌లోని మురికివాడలు ట్రంప్‌నకు కనిపించకుండా ఉండేందుకు ఏర్పాటుచేసిన గోడలు అయితే కూలవు కదా అని నీరజ్ భాటియా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదేమీ పెద్ద ప్రమాద ఘటన కాదని క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ అజయ్ తోమర్ అన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు (ఫిబ్రవరి 24న) మొతేరా స్టేడియంలో సంయుక్తంగా ప్రసంగించనున్నారు.