EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఎంత ఇవ్వాలనే విషయంలో కీలక నిర్ణయం
EPF Interest Rate: ఈపీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల భవిష్య నిధిపై ఎంత వడ్డీ ఇవ్వాలనే విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు.
EPF Interest Rate: ఈపీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల భవిష్య నిధిపై ఎంత వడ్డీ ఇవ్వాలనే విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు.
ఈపీఎఫ్ వడ్డీ ( EPF Interest ) విషయంలో గత కొద్దికాలంగా అనిశ్చితి నెలకొంది. ఉద్యోగుల భవిష్యనిధికి సంబంధించి ఈపీఎఫ్ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ ఎంత ఇవ్వాలనే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మార్చ్ 4న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్‌లో ఈ సమావేశం జరగనుంది. గత ఆర్ధిక సంవత్సరం అంటే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై 8.5 శాతం వడ్డీ రేటు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ రేటు ( Epf interest for 2020-21 ) ఇంత ఇవ్వడం సాధ్యపడకపోవచ్చని..రేటును తగ్గించే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో సభ్యులు ఎక్కువగా తమ నిధుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు తాజాగా జమ కూడా తగ్గడం కారణం. 2018-19 లో ఈపీఎఫ్ వడ్డీ రేటు ( Epf interest rate )8.65 శాతంగా ఉన్న విషయం గమనార్హం. 2012-13 తరువాత గత ఏడాది ఇచ్చిందే అత్యల్పం.
Also read: West bengal survey: పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరిది..ఆ సర్వేలో ఏం తేలింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook