West bengal survey: పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరిది..ఆ సర్వేలో ఏం తేలింది

West bengal survey: దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కోసం దీదీ ప్రయత్నిస్తుంటే.. బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ సర్వేలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తిగా మారింది. 

Last Updated : Feb 17, 2021, 06:49 PM IST
  • హోరాహోరీగా సాగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
  • హ్యాట్రిక్ కోసం మమతా బెనర్జీ, అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు
  • సీఎన్ఎక్స్, ఏబీపీ ఆనంద సర్వేలో 146-156 స్థానాలతో టీఎంసీ విజయమని వెల్లడి
West bengal survey: పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరిది..ఆ సర్వేలో ఏం తేలింది

West bengal survey: దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కోసం దీదీ ప్రయత్నిస్తుంటే.. బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ సర్వేలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తిగా మారింది. 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు( West Bengal Assembly Elections ) త్వరలో జరగనున్నాయి. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో అధికార పార్టీ టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు కుదుర్చుకోగా..టీఎంసీ, బీజేపీలు ఒంటరిగా తలపడుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకూ పశ్చిమ బెంగాల్‌లో ఏ మాత్రం ఉనికి లేని బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంంగా దూసుకొచ్చి ఏకంగా 18 ఎంపీ స్థానాల్ని చేజిక్కించుకుంది. అప్పట్నించి బీజేపీ రాష్ట్రంలో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా ( Amit shah ), జేపీ నడ్డాలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా టీఎంసీకు చెందిన అగ్రనేతలందర్నీ పార్టీలో చేర్చుకుని మమతా బెనర్జీకు షాక్ ఇస్తున్నారు. మంత్రుల్నించి మొదలుకుని..ఎమ్మెల్యేలు , ఎంపీలు కూడా  బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. రాష్ట్రంలోని జంగల్ మహల్, నందిగ్రాం ప్రాంతాల్లో పట్టున్న సువేందు అధికారి సైతం బీజేపీలో చేరిపోవడం మమతా బెనర్జీకు ఎదురు దెబ్బే. 

అయితే నేతలు వెళ్లిపోయినా..ప్రజా మద్దతు తనకేనంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( West Bengal cm Mamata Banerjee ). పదేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను మరోసారి గెలిపిస్తాయని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామనే ధీమాలో మమతా బెనర్జీ ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా విజయం తమదేననే ధీమాలో ఉంది. బెంగాల్ పీఠంపై కాషాయ జెండా కచ్చితంగా ఎగురవేస్తామంటోంది. ఈ నేపధ్యంలో ఇటీవల  రెండు  సంస్థలు నిర్వహించిన  సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. సీఎన్ఎక్స్, ఏబీపీ ఆనంద ( CNX-ABP Ananda )సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 7 వరకూ 8 వేల 960 మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సర్వే ఫలితాల్ని వెల్లడించింది. హోరాహోరీ పోరులో టీఎంసీ ( TMC ) అధికారం దక్కించుకుంటుందని సర్వేలు వెల్లడించాయి. టీఎంసీ 146-156 స్థానాల్లో విజయం సాధిస్తుందని..అదే సమయంలో బీజేపీ ( BJP ) 113-121 స్థానాలు  గెలుస్తుందని సర్వే తెలిపింది.  కాంగ్రెస్- వామపక్షాల కూటమికి 20-28 స్థానాలు మాత్రమే లభిస్తాయని సర్వే వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ అధికారం కోసం కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 148.

Also read: Delhi violence case: ఢిల్లీ హింసాత్మక ఘర్షణల్లో మోస్ట్ వాంటెడ్ అరెస్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News