పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ECRతో ప్రయోజనం
EPFO సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పీఎఫ్ ఖాతాదారులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PMGKY) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది
లాక్‌డౌన్ కష్టకాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పీఎఫ్ ఖాతాదారులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PMGKY) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నగదు ఈపీఎఫ్, ఈపీఎస్ ఖాతాదారుల ఖాతాల్లో జమ అవుతుంది. Bikiniలో అందాల భామ హాట్ ఫొటోలు
గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ప్రకారం.. అర్హత కలిగిన సంస్థలు, ఉద్యోగులు ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) సమర్పించాలి. ఈపీఎఫ్, ఈపీఎస్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో 3 నెలల పీఎఫ్ డబ్బులను (ఉద్యోగి వాటా, కంపెనీ చెల్లించాల్సిన వాటా) ఈపీఎఫ్‌ఓ జమ చేస్తుంది. అయితే నెలవారీ వేతనం రూ.15,000, అంతకన్నా తక్కువ వేతనం ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు మాత్రమే ఈ ఈసీఆర్ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ప్రధాని మోదీ 7 కీలక సూచనలు
ఈ మూడు నెలల వ్యవధిలో కేంద్రానికి రూ.4,800 కోట్ల మేర ఖర్చు కానుందని అంచనా వేశారు. తాజా పథకానికి సంబంధించిన విధివిధానాలు, అర్హుల వివరాలను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ, ఈపీఎఫ్‌ఓ నిర్ణయంతో 3.8 లక్షల కంపెనీలు, 79 లక్షల పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈసీఆర్ అప్లై చేసిన తర్వాత పరిశీలించి అర్హులకు నగదు డిపాజిట్ చేస్తారు. గుడ్ న్యూస్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సరికొత్త సదుపాయం
కాగా, కరోనాపై యుద్ధం నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించి అమలుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.1.7లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆర్బీఐ, ఎస్‌బీఐ బ్యాంకులు సైతం తమ ఖాతాదారులకు మూడు నెలలపాటు మరటోరియం అందించడం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos