PF Death Claim Rules: డెత్ క్లెయిమ్ నిబంధనల్లో మార్పులు చేసిన ఈపీఎఫ్ఓ, క్లెయిమ్ ఎలా సెటిల్ చేస్తారు
PF Death Claim Rules: మీరు ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ హోల్డర్ అయుంటే ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ లేదా నిబంధనల్లో మార్పులు గమనిస్తుండాలి. ఇప్పుడు ఈపీఎఫ్ఓ తాజాగా డెత్ క్లెయిమ్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.
PF Death Claim Rules: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ తాజాగా కొన్ని మార్పులు చేసింది. అందులో కీలకమైంది డెత్ క్లెయిమ్. కొత్తగా వచ్చిన మార్పుల ప్రకారం డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు ఎక్కువ సమయం పట్టదు. మీ ఎక్కౌంట్‌లో నమోదు చేసిన నామినీకు పీఎఫ్ డబ్బులు చెల్లించేస్తారు. కొత్త రూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగికి తప్పకుండా ఉండేది పీఎఫ్ ఎక్కౌంట్. ఆ ఉద్యోగి జీతం నుంచి ప్రతినెలా కొద్దిమొత్తం పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ అవుతుంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తూ ఆ ఉద్యోగి మరణిస్తే ఎక్కౌంట్‌లో నామినీగా ఉన్న వ్యక్తికి పీఎఫ్ డబ్బులు బదిలీ అవుతాయి. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఎక్కౌంట్‌కు ఆధార్ లింక్ లేకపోయినా నామినీని బట్టి డబ్బులు చెల్లించేస్తారు. అంతేకాకుండా డెత్ క్లెయిమ్ సెటిల్ అయ్యేందుకు పెద్దగా సమయం పట్టదు.
పీఎఫ్ ఎక్కౌంట్‌తో ఆధార్ కార్డు లింక్ చేసి వెరిఫై చేయడంలో సమస్యలు ఎదురవుతుండటంతో సమయం కూడా ఎక్కువ పడుతోంది. ఫలితంగా డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఆలస్యమౌతోంది. పీఎఫ్ ఎక్కౌంట్ సభ్యుడు మరణిస్తే ఆధార్ కార్డులో ఉన్న సమాచారం సవరించేందుకు అవదు. దాంతో ఫిజికల్ వెరిఫికేషన్ తరువాతే నామినీకు డబ్బులు అందుతాయి. చాలామంది డెత్ క్లెయిమ్ విషయంలో మోసాలు చేస్తుంటారు. ఈపీఎఫ్ఓ వీటన్నింటిపై దృష్టి సారించింది.
డెత్ క్లెయిమ్ ఎలా సెటిల్ చేస్తారు
ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన ప్రకారం క్లెయిమ్ సెటిల్‌మెంట్ కంటే ముందు నామినీ లేదా కుటుంబసభ్యుడితో వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తరువాతే పీఎఫ్ డబ్బులు చెల్లిస్తారు. పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు మ్యాచ్ కానప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. పీఎఫ్ సభ్యుడి వద్ద ఉన్న యూఏఎన్ నెంబర్ తప్పయినా ప్రక్రియ మరోలా ఉంటుంది. పీఎఫ్ ఎక్కౌంట్‌లో నామినీ చేర్చి ఉంటే పీఎఫ్ డబ్బులు ఆటోమేటిక్‌గా నామినీకు చేరుతాయి. దీనికోసం ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.
Also read: IMD Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook