IMD Weather Updates: నైరుతి పశ్చిమ మద్య బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడి ఆ తరువాత తుపానుగా మారనుంది. ఏపీకు ముప్పు తప్పడంతో 25వ తేదీకు ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటవచ్చు. ఫలితంగా ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా వాయుగుండంగా మారనుందని వాతావరణం శాఖ వెల్లడించింది. వాయుగుండం తుపానుగా మారిన తరువతా ఉత్తర ఒడిశా తీరంవైపుకు పయనిస్తుందని తెలుస్తోంది. దాంతో ఏపీ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వచ్చేయాలని సూచనలు జారీ అయ్యాయి. రెండ్రోజులపాటు అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. సముద్రంలో కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. సముద్రంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఫైబర్ బోట్లు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. రేపు అంటే మే 24 వరకూ తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షితం ప్రదేశాలకు తరలివెళ్లాలని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావం ఇవాళ్టి నుంచి మే 27 వరకూ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై కూడా ఉండవచ్చని తెలుస్తోంది.
ఇక నైరుతి రుతుపవనాలైతే ముందుగా ఊహించినట్టే మే 31న కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ నెలలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్ని తాకిన నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
Also read: IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IMD Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తమిళనాడుల్లో భారీ వర్షసూచన