EPFO Whatsapp Service: ఈపీఎఫ్ఓ కొత్త సేవల్ని ప్రారంభించింది. వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలకు తక్షణం పరిష్కారం కలిగేందుకు వీలుగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) ఎప్పటికప్పుడు వినియోగదారులకు లేటెస్ట్ అప్‌డేట్స్ అందించడంలో ముందుంటోంది. ఇప్పుడు మరో కొత్త సేవల్ని ప్రారంభించింది. ఖాతాదార్ల సమస్యల పరిష్కారం కోసం వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్ ( Whatsapp helpline number )‌ను ప్రారంభించింది. ఒక్కో సెంటర్‌కు ఒక్కే వాట్సప్ నెంబర్ కేటాయించింది. ప్రతి చిన్న పనికీ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్ సేవల్ని ప్రారంభించినట్టు సంస్థ తెలిపింది. ఖాతాదారుల ఫిర్యాదుల కోసం ఇంతకుముందే గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఫోరం ప్రారంభించింది. సమస్యల పరిష్కారం కోసం వాట్సప్ సేవలే కాకుండా EPFIGMS, CPGRAMS పోర్టళ్లతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండే కాల్ సెంటర్ కూడా నడుపుతోంది. 


వాట్సప్ సేవల ద్వారా ఈపీఎఫ్ చందాదారులు డిజిటల్ విధానంలో ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల్ని( Epfo regional offices) కాంటాక్ట్ చేయవచ్చు. కావల్సిన సమాచారాన్ని నేరుగా పొందవచ్చు. ఈపీఎఫ్ఓకు దేశంలో ఉన్న మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. మీకు కావల్సిన ప్రాంతీయ కార్యాలయం వాట్సప్ నెంబర్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.


రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల వాట్సప్ నెంబర్లు


Hyderabad ( Barkatpura) 9100026170
Hyderabad ( Madhapur) 9100026146
Karimnagar 9492429685
Kukatpally 9392369549
Nizamabad 8919090653
patancheru 9494182174
Siddipet 9603262989
Warangal 8702447772
Guntur 0863-2344123
kadapa 9491138297
Rajahmundry 9494633563
Visakhapatnam 7382396602


Also read: Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్ , రోజుకు వేయి కేసుల నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook