పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తమ ఖాతాదారులకు చేదు వార్తను అందించింది. ఖాతాదారుల వడ్డీ రేట్లను సవరించి షాకిచ్చింది.
న్యూఢిల్లీ: ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఖాతాదారుల నగదుపై వడ్డీ రేటను ఈపీఎఫ్ఓ తగ్గించింది. 2019-20 ఏడాదికిగానూ వడ్డీరేట్లను 8.50గా చేస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. మార్చి 5న (గురువారం) EPFO సెంట్రల్ బోర్డ్ ట్రస్టీలు భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 2018-19 ఏడాదికిగానూ ఈ వడ్డీరేటు 8.65 శాతంగా ఉండేది. దీంతో పీఎఫ్ ఖాతాదారులందరి నగదుపై వడ్డీరేటు తగ్గనుంది.
Also Read: రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?
పీఎఫ్ ఖాతాలపై వడ్డీరేటును 8.65 శాతం నుంచి 8.5 శాతానికి కుదించినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు. PF వడ్డీ రేట్లలో కోత విధించడంతో ఈపీఎఫ్‌వోలోని దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులను ప్రభావం పడనుంది. కాగా, పీఎఫ్ ఖాతాలపై వడ్డీరేట్లను సవరించాలని గత కొంతకాలం నుంచి సంస్థ యోచిస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీతో నాటీగా విజయ్ దేవరకొండ