రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?

భయంకరమైన వైరస్ కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే కరోనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రవేశపెట్టింది.

Last Updated : Mar 5, 2020, 01:30 PM IST
రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?

చైనాలో మొదలైన ప్రాణాంతక వైరస్ దాదాపు 60 దేశాలకు పాకింది. తాజాగా భారత్‌లో దీని ప్రభావం కనిపిస్తోంది. రోజురోజుకూ పాజిటీవ్ కేసులు పెరగడం, కరోనా టెస్టులు చేయడానికి తమకు సమయం దొరకడంలేదంటూ డాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తతో కొందరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు. తాజాగా డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ కరోనా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చిందని చైర్మన్ కామేష్ గోయల్ తెలిపారు.

రాహుల్ సిప్లింగంజ్‌పై దాడి చేసింది ఎవరు?

కరోనా వైరస్‌కు సంబంధించి డిజిట్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఈ కరోనా ప్రీమియం పాలసీ రూ.299 నుంచి మొదలవుతుంది. కరోనా వైరస్ టెస్టులో పాజిటీవ్‌గా తేలితే వినియోగదారులు ఇన్సూరెన్స్ నగదును 100శాతం క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.25,000 నుంచి దాదాపు రూ.2 లక్షల వరకు కరోనా హెల్త్ పాలసీలను సంస్థ అందిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీతో నాటీగా విజయ్ దేవరకొండ

అత్యవసర పాలసీ..
COVID19 (కరోనా వైరస్) ఉందని టెస్టుల్లో తేలితే.. ఆ వ్యక్తులకు మొత్తం ఇన్సూరెన్స్ నగదు చేతికి అందుతుంది. కరోనా అనుమానిత కేసులకు కొద్దిమేర క్లెయిన్ చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. కరోనా అనుమానితులకు కూడా రెండు వారాల పాటు ఓ ప్రత్యేక ప్రాంతంలో చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో వారికి ఆదాయం ఉండదు కనుక వీరు సైతం కొంతమేర కరోనా ఇన్సూరెన్స్ నగదు పొందవచ్చు.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ 

డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థను కామేష్ గోయల్ 2016లో స్థాపించారు. కరోనా లాంటి వైరస్‌లు ప్రబలుతున్న విపత్కర పరిస్థితుల్లో సామాన్యులకు కరోనా ఇన్సూరెన్స్ పాలసీ దోహదం చేస్తుందన్నారు. పాలసీదారులు ఇన్సూరెన్స్ నగదు కొంతమేర వెచ్చించి పలు రకాల స్క్రీనింగ్ టెస్టులకు వాడుకోవచ్చునని వివరించారు.

Must Read: వ్యభిచారం చేయలేదు.. నన్ను వదిలేయండి: నటుడు ఆవేదన

Also Read: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి : యాంకర్ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News