ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో  పలు సౌకర్యాలను అందిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతా ఉన్న వారికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయిస్తారు. ఈ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఆధారంగా ఆన్‌లైన్‌లో మీ ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund) ఖాతాలో నగదును తేలికగా తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతా ప్రొఫైల్‌తో పాటు ఆన్‌లైన్ పాస్‌బుక్‌ను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, వివరాలు మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. అయితే కొంత మంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నగదు ఎంత ఉంది, పింఛన్ కిందకి ఎంత నగదు ప్రతి నెలా జమ అవుతుందో తెలుసుకోవాలని భావిస్తారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఒకవేళ EPF ఖాతాదారులు ఆన్‌లైన్ సౌకర్యాన్ని వాడటానికి తమకు ఇబ్బంది ఉంటే మరో ప్రత్యామ్నాయ మార్గం ఉంది. ఆఫ్‌లైన్ విధానంలోనూ సులువుగా PF ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ మరియు చివరగా పీఎఫ్ ఖాతాలోకి ఎంత నగదు జమ చేశారన్న వివరాలు సైతం తెలుసుకునే అవకావాన్ని కల్పించింది. ఇప్పుడు మీరు ప్రావిడెంట్ ఫండ్ వివరాలను కేవలం ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి వివరాలను పొందవచ్చు. 



 


ఆ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన సదరు ఉద్యోగి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు పీఎఫ్ ఖాతాలోని నగదు వివరాలు మెస్సేజ్ రూపంలో అందుతాయి. అయితే పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నెంబర్‌కు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్లలో ఏదైనా ఒకటి వివరాలు అప్‌డేట్ చేసిన వారికి పీఎఫ్ బ్యాలెన్స్‌తో పాటు చివరగా ఎంత మేర నగదు పీఎఫ్ ఖాతాకు జమ అయిందన్న వివరాలు అందుతాయి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe